చేతబడి చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.. ఘటనాస్థలంలో చనిపోయిన పందిపిల్ల.. ట్విస్ట్ ఏంటంటే..?

మూఢ విశ్వాసం మళ్లీ పడగ విప్పింది. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా మారుమూల పల్లెల్లో మాత్రం ఇంకా మార్పులు రావడం లేదు. చేతబడులు, క్షుద్రపూజలు చేస్తే..

చేతబడి చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.. ఘటనాస్థలంలో చనిపోయిన పందిపిల్ల.. ట్విస్ట్ ఏంటంటే..?
Black Magic
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 22, 2021 | 9:36 PM

మూఢ విశ్వాసం మళ్లీ పడగ విప్పింది. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా మారుమూల పల్లెల్లో మాత్రం ఇంకా మార్పులు రావడం లేదు. చేతబడులు, క్షుద్రపూజలు చేస్తే.. అతీత శక్తులు వస్తాయని ఇంకా నమ్ముతున్నారు. జంతువులను, చిన్నారులను బలి ఇస్తే.. తమకు శక్తులు వశమవుతాయనే మూర్ఖపు జాఢ్యంలో ఉన్నారు కొందరు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో చేతబడి కలకలం రేపింది. పెదగొల్లగూడెంలో చేతబడి చేస్తూ.. గ్రామస్థులకు పట్టుబడ్డారు ముగ్గురు వ్యక్తులు. ఘటనాస్థలం నుంచి మృతి చెందిన ఓ పంది పిల్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఓ చిన్నారి కూడా ఉండటంతో షాక్‌కు గురైన స్థానికులు.. ఆ పాపను రక్షించారు. గ్రామస్థుల సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు ఆ ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు.

ఎండు చేపలు, అన్నం ముద్దలతో క్షుద్రపూజలు..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఊర్లోనే కాదు, పంట పొలాల వద్ద కూడా క్షుద్రపూజలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గుర్తుతెలియని వ్యక్తులు. ఇటీవల సుల్తానాబాద్  శివారులో రాయికల్‌దేవ్‌పల్లి వెళ్లే రోడ్డులో చొప్పరి అంజయ్య అనే రైతు పొలం వద్ద భయంకరంగా క్షుద్ర పూజలు చేశారు.  అర్థరాత్రి పూట గుర్తుతెలియని వ్యక్తులు అంజయ్య పొలం వద్ద ఇరవై కొబ్బరి కాయలు, జీడిగింజలు, మిరపకాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్డు, ఎండు చేపలు, పసుపు, కుంకుమలతో కలిపిన అన్నం ముద్దలు, గవ్వలు విస్తరాకులు పెట్టి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే రెండు పేపర్ల తీసుకుని.. ఒకదాంట్లో మనిషి బొమ్మ ఆనవాళ్లు గీసి.. మరో దాంట్లో చేతి అచ్చుల నమోనాలను గీసి పొలంలో క్షద్రపూజలు చేశారు.

తెల్లారేసరికి అంజయ్య పొలం వద్దకు రాగానే భయంకరంగా క్షుద్రపూజల ఆనవాళ్లు కనబడడంతో తనకు ఎవరో మంత్రాలు చేశారని భయపడిపోతున్నాడు. గతంలో ఒకసారి ఇంటివద్ద రాత్రిపూట గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారని, ఇప్పుడు పొలం వద్ద చేయడంతో భయాందోళనలకు గురవుతున్నాడు అంజయ్య. క్షుద్రపూజల విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు అంజయ్య తెలిపాడు.

Also Read:  సూర్యాపేటలో జాతీయ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి.. కూలీన మూడు గ్యాలరీలు

కోడలిని కన్నకూతురిగా చూసుకోవాల్సిన మామ దారి తప్పాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో