AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: కోడలిని కన్నకూతురిగా చూసుకోవాల్సిన మామ దారి తప్పాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో

ఇంటికొచ్చిన కోడలిని కన్నకూతురిగా చూసుకోవాల్సిన సొంత మామ సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో...

AP Crime News: కోడలిని కన్నకూతురిగా చూసుకోవాల్సిన మామ దారి తప్పాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో
Father In Law Harassed
Ram Naramaneni
|

Updated on: Mar 22, 2021 | 9:17 PM

Share

కోడలిని కన్నకూతురిగా చూసుకోవాల్సిన సొంత మామ ట్రాక్ తప్పాడు.  సభ్యసమాజం తలదించుకునేలా కోడలిపై అత్యాచారయత్నం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన దుర్భుద్ది ప్రదర్శించాడు. అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. తనకల్లు మండలంలోని ఓ విలేజ్‌కు చెందిన ఆవుల చంద్రప్ప కొన్నేళ్ల క్రితం ఓ యువతితో తన కొడుక్కి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె పుట్టింది. అయితే, కోడలు ఇంటికి వచ్చినప్పటి నుంచే ఆమెపై కన్నేసిన చంద్రప్ప ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏదో ఒక పని పేరు చెప్పి కోడలిని తాకేందుకు యత్నించేవాడు. మామ ప్రవర్తనను గమనించిన కోడలు.. ఈ విషయాన్ని భర్తతో పాటు అత్తకు చెప్పి వాపోయింది. దీనిపై పంచాయితీ పెట్టిన గ్రామ పెద్దలు.. చంద్రప్ప పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మార్చి 5న అత్త, భర్త మేకలు మేపుకోవడానికి చేనుకి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చంద్రప్ప మరోసారి తన దుర్భుద్ది ప్రదర్శించాడు. ఒంటరిగా ఉన్న కోడలిపై అత్యాచారయత్నం చేశాడు. అతడిని ఎదిరించిన కోడలు.. ఎలాగోలా బయటపడి కుమార్తెను తీసుకుని పారిపోయింది. తన తల్లి, భర్తతో కలిసి పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకుని.. వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. తండ్రి స్థానంలో ఉండి బాగోగులు చూడాల్సిన వ్యక్తి.. ఇలా ప్రవర్తించడంతో స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటివారు సమాజంలో ప్రమాదకరమని.. పోలీసులు కఠినమైన కేసులు పెట్టి.. న్యాయస్థానంలో శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read : సూర్యాపేటలో జాతీయ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి.. కూలీన మూడు గ్యాలరీలు

Hi-tech copying: పోలీసు నియామక పరీక్షల్లో హైటెక్​ కాపీయింగ్.. మాస్క్‌ల్లో ఇంత సెటప్పా.. మైండ్ బ్లాక్

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..