Counter Fire: మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు.. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లో మరో సారి ఎదురుదెబ్బతగిలింది. దండకారణ్యంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
Counter Fire in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో సారి ఎదురుదెబ్బతగిలింది. దండకారణ్యంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పెద్ద వస్తు, సామాగ్రి పట్టుబండింది. ఈ వివారలను సోమవారం బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పాటిలింగం మీడియాకు చూపించారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఆమాబేడా క్షేత్రాంతర్గతంలో గత మాలపారా – కాంటూర్ మధ్యగల అటవీ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ 17వ బెటాలియన్ భద్రతా బలగాలు, జిల్లా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించింది. మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులకు దిగారు.
వెంటనే అప్రతమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. జవాన్ల ధాటికి తట్టు కోలేక మావోయిస్టులు పారిపోయారు. ఇరువైపుల ఎవరూ గాయపడనప్పటికీ… పెద్ద ఎత్తున వస్తువులు మాత్రం దొరికాయి. కాల్పుల ముగిసిన వెంటనే భద్రతా బలగాల ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఈ ఘటనలో భారీ స్థాయిలో మావోయిస్టుల వస్తువులు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలంలో భారీ ఎత్తున మావోయిస్టులకు సంబంధించిన పేలుడు పదార్థాలు, ఆయుధ, వస్తు సామగ్రి స్వాధీనపరుచుకున్నట్లు ఐజీ సుందర్‌రాజ్ పాటిలింగ్ తెలిపారు.
ఇదిలావుంటే… గత కొంత కాలంగా ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అనుకూలంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం తమ సెర్చ్ ఆపరేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు.