AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime News: తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త.. మీ పిల్లల్ని ఆడుకోడానికి బయటకు వదులుతున్నారా..?

తల్లిదండ్రులూ.. తస్మాత్‌ జాగ్రత్త. మీ పిల్లల్ని ఆడుకోడానికి బయటకు వదులుతున్నారా..? పిల్లలతోపాటు బయటకు వెళ్లినపుడు వారిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారా..? అయితే.. ఈ వార్త మీలాంటి వారికోసమే...

Hyderabad Crime News: తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త.. మీ పిల్లల్ని ఆడుకోడానికి బయటకు వదులుతున్నారా..?
Kidnap Case
Ram Naramaneni
|

Updated on: Mar 22, 2021 | 9:48 PM

Share

తల్లిదండ్రులూ.. తస్మాత్‌ జాగ్రత్త. మీ పిల్లల్ని ఆడుకోడానికి బయటకు వదులుతున్నారా..? పిల్లలతోపాటు బయటకు వెళ్లినపుడు వారిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారా..? అయితే.. ఈ వార్త మీలాంటి వారికోసమే.  ఈ మధ్య కిడ్నాపులు పెరిగిపోతున్నాయి. తాజాగా పాతబస్తీ చార్మినార్‌ చూసేందుకు గంగమ్మ అనే వృద్ధురాలు తన ఇద్దరు మనవళ్లతో వెళ్లింది. పైన చార్మినార్‌ చూసేలోపు కింద పిల్లల్ని కిడ్నాప్‌ చేశారు దుండగులు. చార్మినార్‌ చూస్తూ ఆ వృద్ధురాలు లోకం మరిచిందో.. లేక.. కిడ్నాపర్లే చాకచక్యంగా ఆ చిన్నారులను అపహరించారో తెలియదు కాని.. చిన్నారులు మిస్‌ అయ్యారు. దీంతో పక్కనే ఉన్న చార్మినార్‌ పోలీసులను ఆశ్రయించింది గంగమ్మ. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. మూడు కమిషనరేట్లను అలర్ట్‌ చేశారు. దాదాపు 200 సీసీకెమెరాల ఫుటేజీ పరిశీలిస్తుండా.. చిన్నారులను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్‌ కంటపడింది. ఆ ఇద్దర్నీ ఎత్తుకెళ్లింది మల్లమ్మ అనే కిడ్నాపర్‌.

చిన్నారులకు మాయమాటలు చెప్పి.. మీ అమ్మమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది అని చెప్పి కిడ్నాప్‌ చేసింది. ఈనెల 14న ఈ కిడ్నాప్‌ జరిగింది. పోలీసులు చాలెంజింగ్‌గా తీసుకుని.. మల్లమ్మను ఎల్బీనగర్‌ చౌరస్తా దగ్గర పట్టుకున్నారు. ఇద్దరు చిన్నారులను తిరిగి వారి అమ్మమ్మకు అప్పగించడంతో ఆమె కన్నీటిపర్యంతమైంది. ఈ కేసులో పనిచేసిన చార్మినార్‌ పోలీసులను అభినందించారు సౌత్‌జోన్‌ డీసీపీ గజారావు భూపాల్‌. తల్లిదండ్రులు చిన్నారులను బయటకు తీసుకొచ్చినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఏమాత్రం అలసత్వంగా ఉన్నా.. చిన్నారులను అపహరించే ముఠాలు నగరంలో సంచరిస్తున్నాయన్నారు. ప్రస్తుతం కిడ్నాపర్‌ మల్లమ్మ పోలీసుల అదుపులో ఉంది. దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనేదానిపై ఆరా తీస్తున్నారు.

Also Read:  సూర్యాపేటలో జాతీయ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి.. కూలీన మూడు గ్యాలరీలు

చేతబడి చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.. ఘటనాస్థలంలో చనిపోయిన పందిపిల్ల.. ట్విస్ట్ ఏంటంటే..?