పుట్టమధును వదిలేసిన పోలీసులు..! విచారణకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ..
Police Leaving Puttamadhu : పెద్దపల్లి లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..
Police Leaving Puttamadhu : పెద్దపల్లి లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ హత్యలకు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధుకు సంబంధం ఉందని వామన్‌రావు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే పుట్టమధు గత కొన్నిరోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో అతడిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. రంగంలోకి దిగిన రామగుండం పోలీసులు పుట్టమధు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి అతడిని అరెస్ట్ చేసి రామగుండం కమిషనరేట్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు.
మూడు రోజుల నుంచి విచారణ చేసిన పుట్టా మధును కేసుకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసిన అనంతరం పోలీస్ కస్టడీ నుంచి సోమవారం అర్థరాత్రి పుట్ట మధును ఇంటికి పంపారు. ఇదే సమయంలో తిరిగి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే పుట్ట మధును మూడురోజుల పాటు విచారించిన బలమైన సాక్ష్యాలు ఏవీ బయటకు రాలేదని సమాచారం. రెండు కోట్ల లావాదేవీలకు సంబంధించి ఎక్కడా కూడా ఆధారాలు లభించలేదని తెలుస్తోంది.
సోమవారం రామగుండం కమిషనరేట్‌లో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఆయన భార్య శైలజతో పాటు మధుకు సన్నిహితుడిగా పేరున్న కమాన్‌పూర్ వ్యవసాయ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణను అధికారులు రోజంతా వివిధ కోణాల్లో ప్రశ్నించారు. హత్యకు ముందు, తరువాత జరిగిన ఫోన్ కాల్‌డాటాతో పాటు ఆర్థిక లావాదేవీల పైనే పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం.