AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Criminals : రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కొరత..! 3,490 గల ఇంజక్షన్‌ను 30 వేలకు విక్రయిస్తున్న ముఠాలు..?

Corona Criminals : దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ రోజు రోజుకు పెరుగుతుంది. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ కరోనా రోగులను ప్రాణాపాయంనుంచి

Corona Criminals : రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కొరత..! 3,490 గల ఇంజక్షన్‌ను 30 వేలకు విక్రయిస్తున్న ముఠాలు..?
Remdacivir Injection
uppula Raju
|

Updated on: May 11, 2021 | 1:03 PM

Share

Corona Criminals : దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ రోజు రోజుకు పెరుగుతుంది. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ కరోనా రోగులను ప్రాణాపాయంనుంచి కాపాడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే అదనుగా బ్లాక్‌ కొంతమంది కేటుగాళ్లు బ్లాక్ మార్క్‌ట్‌ చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఫార్మసీ కేంద్రాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. జంటనగరాల కమిషనరేట్‌ పరిధిలో నిరంతరం దాడులు జరుపుతున్న ఎస్‌వోటి, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. అయినప్పటికీ బ్లాక్‌ మర్కెట్‌ దందా ఆగడం లేదు.

రూ.3,490 విలువైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను రూ.30000- 35000లకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు కొండాపూర్‌లో అరెస్ట్ చేశారు. అయినప్పటికి కేవలం పదిశాతం ముఠాలు మాత్రమే పట్టుబడుతున్నాయి. చాపకింది నీరులా బ్లాక్‌ మార్కెట్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. రెమ్‌ డెసివిర్‌ ఇంజక్షన్ల విషయంలో కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. రెమ్‌ డెసివిర్‌ ఇంజక్షన్‌ కావాలంటూ బాధితుల బంధువులను హైరానా పెట్టిస్తున్న ఆసుపత్రులు. వారి బలహీనతను ఆసరా చేసుకొని తమ వద్ద ఉన్నాయంటూ ఒక్కో ఇంజక్షన్‌కు రూ. 15నుంచి 25వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఎమ్మార్పీ ప్రకారం ఆరు ఇంజక్షన్లకు రూ. 21 వేలు మాత్రమే. కానీ దానికి నాలుగింతలు అధికంగా వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరికొందరు నకిలీ ఇంజక్షన్లతో కరోనా బాధితులను మోసం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ కరోనా రోగికి వైద్యులు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను సిఫార్సు చేశారు.. ఓ మధ్యవర్తి ద్వారా రోగి బంధువులు రూ.85 వేలకు 5 రెమ్‌డెసివిర్‌ కొనుగోలు చేశారు. ఆసుపత్రి సిబ్బందికి అప్పగించగా వాటిలో నీళ్లు పోసినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాళీ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ సీసాల్లో సెలైన్‌ సీసాలోని నీళ్లు నింపి రోగులకు విక్రయించినట్లు డాక్టర్‌, కాంపౌండర్‌ ఒప్పుకున్నారు.

అలాగే నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు నల్లబజారుకు తరలిస్తూ ఓ నర్సు పోలీసులకు చిక్కింది. రోగి బంధువుతో రూ.89 వేలకు బేరం కుదుర్చుకుంది. ఇలాంటి ఘటనలు ప్రతీ చోట జరగటం పరిపాటిగానే మారింది. మరోవైపు కరోనా బాధితులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ సంజీవని కాదంటున్న డాక్టర్లు. క్లిష్ట పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన వారికి మాత్రమే రెమ్‌డెసివర్‌ అవసరమని చెబుతున్నారు. వైద్యులు తప్పని సరి అంటేనే వాటిని వాడాలని సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో రెమ్‌డెసివిర్‌.. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను ఆన్‌లైన్‌ ద్వారా అందించాలని హెటిరో కంపెనీ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద రెమ్‌డెసివిర్‌ స్టాల్ ను ఏర్పాటు చేశారు. రెమ్‌డెసివిర్ కావాల్సిన వారు నగరం పేరు, ఆస్పత్రి పేరు, ఐపీ నంబర్, రోగి పేరు, అటెండర్‌ పేరు, మొబైల్‌ నంబర్, ఇంజక్షన్ల సంఖ్య వివరాలను ఫొన్ నెంబర్‌కు మెసేజ్ ద్వారా తెలియజేయాలి. మొబైల్‌ నంబర్‌ 91338 96969కు వాట్సాప్‌ గానీ, మెసేజ్‌గానీ పంపించాలని , మందును ఎప్పుడు అందజేస్తామో వారి ఫోన్‌కే మెసేజ్‌ వస్తుందని అప్పుడు మాత్రమే వచ్చి తీసుకెళ్లాలని కంపెనీ వెల్లడించింది.

Telangana High Court: రంజాన్ తరువాత లాక్‌డౌన్ పెడతారా..? తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Covid-19 Vaccination: కరోనా కల్లోలానికి వ్యాక్సి్న్‌తోనే కట్టడి.. టీకా తీసుకునేందుకు మొగ్గుచూపుతున్న యువత