బెంగళూరు పోలీసు శాఖలో విషాదం.. ప్రేమ వివాహం చేసుకున్న పోలీసు దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య
బెంగళూరులో పోలీసు శాఖ లో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న పోలీసు దంపతులు ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది...
బెంగళూరులో పోలీసు శాఖ లో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న పోలీసు దంపతులు ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంపిగేహళ్లి విభాగంలో ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సురేష్ 36), బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో సిటీ ఎస్‌బీలో విధులు నిర్వహిస్తున్న షీలా (35)లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు కొత్తనూరులో నివాసం ఉంటున్నారు.
అయితే సాధారణంగానే ఉన్న సురేష్ ఇంటికెళ్లి శుక్రవారం విధులకు రాకపోవడంతో సిబ్బంది మొబైల్‌కు సందేశం పంపించారు. ఇక స్పందించకపోవడంతో సమీపంలో ఉన్న మరో ఉద్యోగికి సురేష్ గురించి సమాచారం అందించారు. దీంతో మరో ఉద్యోగి ఆయన ఇంటికి వెళ్లి చూడగా, దంపతులిద్దరు వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని కనిపించారు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. వారి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇరు కుటుంబాల వల్ల ఏవైనా సమస్యలు తలెత్తాయా.? ఆర్థిక ఇబ్బందులేమైనా ఉండి, ఇద్దరి మధ్య గొడవలేమైనా జరిగాయా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు పోలీసులు.