పెళ్లి బారాత్‌లో తుపాకీ కాల్పులు: గన్ తో పెళ్లికొడుకు డ్యాన్స్, కత్తులు, తల్వార్లతో మిత్రుల హంగామా..హడలెత్తిన జనం.!
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన పెళ్లి వేడుకలో గన్ ఫైర్ కలకలం రేపుతోంది. గన్‌తో కాల్పులు, కత్తులు తల్వార్లతో డ్యాన్సులతో హంగామా సృష్టించారు...
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన పెళ్లి వేడుకలో గన్ ఫైర్ కలకలం రేపుతోంది. గన్‌తో కాల్పులు, కత్తులు, తల్వార్లతో డ్యాన్సులతో హంగామా సృష్టించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడా మొహమ్మద్ హిల్స్ లో ఈ సీన్ కనిపించింది. అర్ధరాత్రి ఓ పెళ్లి బారాత్‌తో రోడ్ పై పెళ్లి కొడుకును ఊరేగిస్తూ.. అతని మిత్రులు చేసిన హడావిడికి అందరూ హడలెత్తిపోయారు. కత్తులు, తల్వార్లు పట్టుకుని ఇష్టమొచ్చినట్లు ఎగిరారు. ఏకంగా పెళ్లికొడుకైతే గన్ చేతిలో పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ వీడియో కాస్తా పోలీసుల కంటపడడంతో.. ఈ పెళ్లి ఎవరిది ? ఈ హడావిడి ఎక్కడ జరిగిందని ఆరా తీశారు. గన్‌లు, కత్తులతో హల్‌చల్ చేసిన వ్యక్తులపై ఆరా తీసి, వారిపై కేసు నమోదు చేశారు చాంద్రాయణగుట్ట పోలీసులు. ఈ ఘటనను పోలీసులు సీరియస్ తీసుకున్నారు. అసలు ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది ? బారాత్‌లో దాన్ని ఎందుకు బయటకి తీశారని ఆరా తీస్తున్నారు పోలీసులు.