AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగాల భర్తీలో స్పీడ్ పెంచిన తెలంగాణ సర్కార్.. ఖాళీల వివరాలు సేకరించిన సీఎస్..

ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది. ఇందులో భాగాంగా శాఖల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను..

ఉద్యోగాల భర్తీలో స్పీడ్ పెంచిన తెలంగాణ సర్కార్.. ఖాళీల వివరాలు సేకరించిన సీఎస్..
Narender Vaitla
|

Updated on: Dec 19, 2020 | 7:44 AM

Share

ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది. ఇందులో భాగాంగా శాఖల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సీఎస్ సోమేష్ కుమార్ సేకరించారు. ఆ మేరకు ఆయా శాఖల విభాగిధిపతులతో సీఎస్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు స్పీడ్ పెంచారు. తాత్కాలిక సచివాలయమైన బీఆర్కే భవన్‌లో విద్య, ఆరోగ్య శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. ఆయా శాఖల్లోని ఖాళీల వివరాలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకున్నారు. మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి.. వాటి నియామం వల్ల ప్రభుత్వంపై ఎంత మొత్తంలో ఆర్థిక భార పడుతుందనే దానిపై అధికారులతో సీఎస్ సమాలోచనలు జరిపారు. కాగా, ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సోమవారం నాడు కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.

ఇదిలాఉంటే.. పోలీస్ ఉద్యోగాల ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌పై ఎన్నికల ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జనవరి చివర్లో గానీ, ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. మరోవైపు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మార్చిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తే చట్టపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తరువాతే ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యే అకాశం ఉందని వారు చెబుతున్నారు. కాగా, దాదాపు 20 వేల పోస్టులను భర్తీ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అభ్యర్థులు పోలీస్ ఉద్యోగం కోసం కసరత్తును ప్రారంభించారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also read:

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 30,868 మంది భక్తులు.. శుక్రవారం నాడు తిరుమలేశుడి హుండీ ఆదాయం ఎంతంటే..

చిత్ర పరిశ్రమకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం.. ధన్యవాదాలు తెలుపుతున్న సినీ ప్రముఖులు