ఫిలిప్పీన్స్‌లో భారత విద్యార్థులపై దాడి

దేశం కాని దేశంలో భారతీయ విద్యార్థులు వర్ణ వివక్షను ఎదుర్కొంటున్నారు. అమెరికాలోనే కాదు ఫిలిప్పిన్స్ లోనూ వర్ణ వివక్షకు గురవుతున్నారు విద్యార్థులు.

ఫిలిప్పీన్స్‌లో భారత విద్యార్థులపై దాడి
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 16, 2020 | 3:08 PM

దేశం కాని దేశంలో భారతీయ విద్యార్థులు వర్ణ వివక్షను ఎదుర్కొంటున్నారు. అమెరికాలోనే కాదు ఫిలిప్పిన్స్ లోనూ వర్ణ వివక్షకు గురవుతున్నారు విద్యార్థులు. తాజాగా తమిళనాడుకు చెందిన విద్యార్థిపై అగంతకులు దాడి చేశారు. వర్ణ వివక్ష చూపుతూ అతి దారుణంగా హింసించినట్లు తెలుస్తోంది.

ఫిలిప్పీన్స్ లో భారతీయ విద్యార్ధులపై దాడి జరిగింది. తమిళనాడుకు చెందిన జవహర్ శ్రీనాధ్ అనే విద్యార్ధి గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఓ షాపుకు వెళ్లగా… అక్కడే ఉన్న ముగ్గురు అగంతకులు వర్ణవివక్ష చూపుతూ రాడ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. పళ్లు ఊడిపోయి తీవ్ర గాయాలపాలైన శ్రీనాధ్‌ను తోటి విద్యార్ధులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు విద్యార్ధులు. ఎంబిబిఎస్ చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్దులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసుల నుంచి సపోర్టు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.