ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసిన వ్యక్తితోనే తనకు పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసిన వ్యక్తితోనే తనకు పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తోంది. పెళ్లి చేసుకునే వరకు వదిలేది లేదంటూ న్యాయ పోరాటానికి దిగింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన కిరణ్ రేఖ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తుంది..ఈ క్రమంలో అదే బ్యాంక్ లో పని చేస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రేణిగుంట్ల నవీన్ తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొంతకాలంగా ఇద్దరు కలిసి తిరిగారు. చివరకు పెళ్లి ప్రస్తావన వచ్చే సరికీ నవీన్ నిరాకరించాడని బాధితులు ఆరోపించింది.
తనను అన్ని విధాలుగా వాడుకున్న నవీన్ పెళ్లి ప్రస్తావన తీయడంతో ముఖం చాటేశాడని కిరణ్ రేఖ ఆవేదన వ్యక్తంచేస్తుంది. దీంతో గ్రామస్తులందరూ యువతికి బాసటగా నిలిచారు. వారం రోజుల నుండి నవీన్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టారు. అబ్బాయితో పెళ్లి చేయడానికి అందరం అండగా ఉంటామన్నారు. వారం రోజుల నుంచి దీక్షకు దిగడంతో ఆ ప్రియుడు- అతని కుటుంబ సభ్యులు ఇల్లు వదిలిపారిపోయారు..