AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17కు పైగా సిమ్స్ నుంచి దివ్యను టార్చర్ పెట్టిన ఉన్మాది నాగేంద్రబాబు

ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలని భావించే పీకలు కోసుకున్నాం అంటూ దివ్యతేజస్విని పొట్టనబెట్టుకున్న ప్రమోన్మాది నాగేంద్రబాబు చెబుతోన్న మాటలు డ్రామాలుగా తేలిపోతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వినిని నాగేంద్రబాబు ఎంత తీవ్రంగా వేధించిందీ దివ్య తన ఇస్టాలైవ్ లో అక్టోబర్ 3న పూసగుచ్చినట్టు వెల్లడించింది. దివ్య ఏమందో ఆమె మాట్లల్లోనే.. “అమ్మాయిలూ.. అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మొదట్లో వారు మనతో చాలా సున్నితంగా ఉండి నమ్మిస్తారు. తర్వాత ముసుగులు తొలగిస్తారు. వారి సైకోయిజాన్ని, విలనిజాన్ని బయటపెడతారు. ప్రతి […]

17కు పైగా సిమ్స్ నుంచి దివ్యను టార్చర్ పెట్టిన ఉన్మాది నాగేంద్రబాబు
Venkata Narayana
|

Updated on: Oct 17, 2020 | 10:25 AM

Share

ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలని భావించే పీకలు కోసుకున్నాం అంటూ దివ్యతేజస్విని పొట్టనబెట్టుకున్న ప్రమోన్మాది నాగేంద్రబాబు చెబుతోన్న మాటలు డ్రామాలుగా తేలిపోతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వినిని నాగేంద్రబాబు ఎంత తీవ్రంగా వేధించిందీ దివ్య తన ఇస్టాలైవ్ లో అక్టోబర్ 3న పూసగుచ్చినట్టు వెల్లడించింది. దివ్య ఏమందో ఆమె మాట్లల్లోనే..

“అమ్మాయిలూ.. అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మొదట్లో వారు మనతో చాలా సున్నితంగా ఉండి నమ్మిస్తారు. తర్వాత ముసుగులు తొలగిస్తారు. వారి సైకోయిజాన్ని, విలనిజాన్ని బయటపెడతారు. ప్రతి ఒక అమ్మాయి ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రెండున్నరేళ్ల కిందట వరకూ నేనూ ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అతనిలో తీవ్రస్థాయిలో విలనిజం, సైకోయిజం గుర్తించాను. ఆ బంధానికి స్వస్తి పలికి నా కెరీర్‌పై దృష్టి సారించాను. అది మొదలు అతడి నుంచి నాకు బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేయలేదు.. నాపై అతను చేస్తున్న దుష్ప్రచారంలోని విషయాలన్నీ నా దృష్టికి, మా కుటుంబసభ్యుల దృష్టికి వచ్చాయి. వారు నాకు అండగా నిలిచి, నేను ధైర్యంగా అడుగులేసేందుకు ప్రోత్సహించారు. దీంతో ఆ నరకం నుంచి తొందరగానే బయటపడ్డాను. అయితే అమ్మాయిగా నాకు కొంత అభద్రతాభావం ఉంది. అతడి నుంచి నా కుటుంబసభ్యులకు ఏమైనా ముప్పు ఉంటుందేమోనన్న ఆందోళన ఉంది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బెదిరింపులు తీవ్రమైతే మాత్రం కచ్చితంగా ఫిర్యాదు చేస్తా. మా అన్నయ్య కూడా డిపార్ట్‌మెంట్‌లోనే ఉన్నాడు. నా స్నేహితుల్లోనే ఎవరో ఒకరు అతనికి సహకరిస్తున్నారు. నా పరిస్థితుల్లో వారే ఉంటే ఏం చేస్తారో ఆలోచించుకోవాలి. నన్ను ఇంజినీరింగ్‌ నుంచి డ్రాపవుట్‌ చేయించాలని చూశాడు. నేను నోరు మూసుకుని పడి ఉండేలా చేయాలనుకున్నాడు. నా కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. వాటన్నింటినీ నేను బలంగా ఎదుర్కొని బయటకు రాగలిగాను. ఇది నా తొలి అడుగు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి నాకు అతని నుంచి బెదిరింపు కాల్స్‌, సందేశాలు వెల్లువెత్తాయి. అతని నంబర్‌ను బ్లాక్‌ చేశాను. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్‌ చేయటం మొదలుపెట్టాడు. ఇలా 17 నంబర్లు మార్చి కాల్స్‌ చేసి బెదిరించాడు. నేను అమ్మాయిని కాబట్టి దుష్ప్రచారం చేస్తే భయపడి ఊరుకుంటానని అనుకుంటున్నట్లున్నాడు. నేను ధైర్యంగా ఎదుర్కొంటాను.” అంటూ ఆ అమాయకురాలు పేర్కొంది. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న ఆమె చివరికి మృగాడి అకృత్యానికి బలైపోయింది. దివ్య మాటలు దిగువున..