AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో దారుణం.. గర్బిణిని కోసి చంపి.. బిడ్డను తీసుకెళ్లింది

వళ్ళు గగురుపొడిచే ఘటన ఒకటి అగ్రరాజ్యంలో జరిగింది. ఒక నిండు గర్భిణిని చంపి ఆమె కడుపులో నుంచి బిడ్డను తీసుకుంది ఒక మహిళ.

అమెరికాలో దారుణం.. గర్బిణిని కోసి చంపి.. బిడ్డను తీసుకెళ్లింది
Balaraju Goud
|

Updated on: Oct 16, 2020 | 10:23 AM

Share

వళ్ళు గగురుపొడిచే ఘటన ఒకటి అగ్రరాజ్యంలో జరిగింది. ఒక నిండు గర్భిణిని చంపి ఆమె కడుపులో నుంచి బిడ్డను తీసుకుంది ఒక మహిళ. ఈ ఘాతుకానికి పాల్పడ్డ టేలర్‌ పార్కర్‌(27) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. టేలర్ పార్కర్ నేరారోపణతో టెక్సాస్‌ జైలులో ఉంది. అయితే, గత గురువారం నాడు 5 మిలయన్‌ డాలర్ల పూచికత్తుపై ఆమె బెయిల్‌పై విడుదలైంది. జైలు నుంచి బయటకు వచ్చిందే తడవుగా ఆమె మరో ఘాతుకానికి పాల్పడింది. ఒక గర్భిణిని చంపి ఆమె బిడ్డను తనకు పుట్టిన శిశువుగా తీసుకొని ఆసుపత్రికి తీసుకొని వచ్చింది. ఈ హఠాత్తు పరిణామంతో షాక్ తిన్న వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తనకు రోడ్డు పక్కన కానుపు అయ్యిందని ఆసుపత్రిలో వారికి కట్టుకథలు చెప్పింది. శిశువు శ్వాస తీసుకోవడం లేదని వెంటనే చికిత్స అందించాలని కోరింది. బిడ్డను పరిశీలించిన డాక్టర్లు ఆమె మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పార్కర్‌ను నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది. చనిపోయిన మహిళ మృతదేహాన్ని పార్కర్‌ ఉంటున్న ప్రాంతానికి 15 కిలో మీటర్ల దూరంలో గుర్తించారు. మహిళ కిడ్నాప్, హత్య ఆరోపణలపై పార్కర్‌ను పోలీసలు మరోసారి అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

Follow Us
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..
కేవలం మొబైల్ ఉంటే చాలు.. ఏఐ (AI) తో ఇంటి నుండే లక్షల సంపాదన
కేవలం మొబైల్ ఉంటే చాలు.. ఏఐ (AI) తో ఇంటి నుండే లక్షల సంపాదన
పోలీసుల అత్యుత్సాహం,యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది
పోలీసుల అత్యుత్సాహం,యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది
అమావాస్య రోజున ఏం తినాలి? ఏం తినకూడదు? సోమవతి అమావాస్య నియమాలు..
అమావాస్య రోజున ఏం తినాలి? ఏం తినకూడదు? సోమవతి అమావాస్య నియమాలు..
రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు..
రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు..