Telangana Crime: లాయర్ దంపతుల హత్యకు ఏడాది.. కొలిక్కి రాని కేసు విచారణ.. జాప్యంపై ఆగ్రహం
సరిగ్గా ఏడాది క్రితం.. ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలో జరిగిన లాయర్ వామనరావు దంపతుల హత్య(Murder) తెలంగాణ(Telangana) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది...
సరిగ్గా ఏడాది క్రితం.. ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలో జరిగిన లాయర్ వామనరావు దంపతుల హత్య(Murder) తెలంగాణ(Telangana) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ కేసు పురోగతిపై ఇప్పటికీ అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో అనారోగ్య కారణాలతో ఒకరు పెరోల్ పై బయటకు రాగా.. మిగతా ఆరుగురు జైల్లోనే ఉన్నారు. అయితే, ఈ డబుల్ మర్డర్ వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి. అంతేకాదు, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ క్రమంలో ఈ కేసుపై సరైన విచారణ జరపలేదనే అనుమానాలు, విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీను. కోర్టు పని కోసం మంథనికి వచ్చి, హైదరాబాద్ వెళ్తున్న వామనరావు దంపతుల్ని దారికాచి హత్య చేశాడు. మరోవైపు ఈ కేసులో అసలు నిందితుల్ని వదిలేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపితేనే అసలు నిందితులు బయటకు వస్తారని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వామనరావు తల్లిదండ్రుల అనుమానాలనూ నివృత్తి చేయాలని కోరుతున్నారు. తన కుమారుడిని చంపిన వారిని ప్రభుత్వం కాపాడుతోందని వామనరావు తండ్రి కిషన్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రికి, డీజీపీ కి లేఖ రాసినా ఫలితం లేదని, ఈ కేసును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి వరకు న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు.
అడ్వొకేట్ దంపతుల హత్య కేసు విచారణలో పురోగతి లేకపోవడం పట్ల తోటి లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంథని బార్ అసోసియేషన్ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపింది. న్యాయవాదుల రక్షణ కోసం అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరమని అభిప్రాయపడింది. ఏడాదికాలం గడిచిపోయింది. కానీ, వామన్‌రావు దంపతుల హత్య కేసు విచారణలో ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. మరి, పోలీసులు ఇప్పటికైనా కేసు దర్యాప్తును వేగవంతం చేస్తారా..? లేదా..? అనేది చూడాల్సి ఉంది.
Also Read
Big News Big Debate Live: బెజవాడలో కర్నాటక.. l మతమా! డ్రెస్ కోడా..!(వీడియో)
Watch Live: మేడారం జాతరలో అసలు ఘట్టం సమ్మక్క ఆగమనం.. మేళ తాళాలతో గద్దెలపైకి..(ఎక్స్‌క్లూజీవ్ వీడియో)