అదనపు కట్నం, అత్తింటి వేధింపులు.. మూడు నెలల గర్భిణీ ఆత్మహత్య
అదనపు కట్నం కావాలంటూ అత్తింటి వారి వేధింపులు తాళలేక మూడు నెలల గర్భిణీ ఆత్మహత్య(Suicide) చేసుకుంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కల్‌కోడె గ్రామానికి చెందిన...
అదనపు కట్నం కావాలంటూ అత్తింటి వారి వేధింపులు తాళలేక మూడు నెలల గర్భిణీ ఆత్మహత్య(Suicide) చేసుకుంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కల్‌కోడె గ్రామానికి చెందిన బస్వరాజ్, మంజుల దంపతులు నివాసముంటున్నారు. పది నెలల క్రితం వారి కుమార్తె నిఖితను దామస్తపురం గ్రామానికి చెందిన సాయికుమార్ కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ.2 లక్షలు నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చారు. ఈ క్రమంలో పెళ్లయిన రెండు నెలల తర్వాత అదనపు కట్నం కోసం భర్త సాయికుమార్, అత్తామామలు నిఖితను వేధించడం మొదలు పెట్టారు. అత్తింటి వేధింపులు తాళలేక నిఖిత.. తన భర్త సాయి కుమార్ తో కలిసి జహీరాబాద్ వెళ్లింది. అయినా వరకట్న వేధింపులు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న నిఖిత తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న తమ కుమార్తెను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురి మృతికి అత్తింటి వారి వేధింపులే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వేధింపులే ఆత్మహత్యకు ప్రధాన కారణమని నిర్ధారించారు. నిందితులు సాయికుమార్, అనుసూజ, యాదప్పను అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు.
Also Read
Organ donation: పుట్టెడు దుఃఖంలోనూ వారికి సంతోషం పంచారు.. బిడ్డ మరణంలోనూ మానవత్వం చాటారు..
Mohan Babu: వారు సర్వనాశనమై పోతారు.. మంచు మోహన్ బాబు శాపనార్థాలు