ప్రేమ పేరుతో పరువు తీస్తోందని.. ప్రియుడితో కలిసి.. కూతురి మెడకు చున్నీ బిగించి..

ప్రేమ పేరుతో పరువు తీస్తోందని కనిపెంచిన కూతురినే తల్లి అత్యంత దారుణంగా హత్య(Murder) చేసింది. వేరే సామాజిక వర్గానికి చెందిన యువకిడిని ప్రేమించిందన్న...

ప్రేమ పేరుతో పరువు తీస్తోందని.. ప్రియుడితో కలిసి.. కూతురి మెడకు చున్నీ బిగించి..
Daughter Murder
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 17, 2022 | 8:05 PM

ప్రేమ పేరుతో పరువు తీస్తోందని కనిపెంచిన కూతురినే తల్లి అత్యంత దారుణంగా హత్య(Murder) చేసింది. వేరే సామాజిక వర్గానికి చెందిన యువకిడిని ప్రేమించిందన్న కారణంతో బిడ్డ ఉసురు తీసింది. తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఆపై వేరే వ్యక్తిపై నేరం మోపేందుకు అన్ని విధాలా ప్రయత్నించింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌(Zahirabad) మండలం హుగ్గెలిల్లో జరిగిన బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూతురిని హత్య చేసేందుకు తల్లి బుజ్జమ్మ.. తన ప్రియుడితో కలిసి పది రోజులు ముందే ప్రణాళిక సిద్ధం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

బాలికను హత్య చేసిన రోజు.. తల్లి, ఆమె ప్రియుడు మద్యం తాగారు. కూతురు ప్రేమిస్తున్న అదే గ్రామానికి చెందిన ఫకీర్‌ అఫ్సర్‌ మామిడి తోటలో ఉన్నాడని, అతనితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందామని తల్లి బాలికను అక్కడికి తీసుకెళ్లింది. ముందస్తు పథకం ప్రకారం.. అప్పటికే అక్కడికి చేరుకున్న నర్సింహులు ప్రేమ మానుకోవాలని బాలికపై ఒత్తిడి తెచ్చాడు. కొద్ది సేపు వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన తల్లి బుజ్జమ్మ..బాలికను కింద పడేసింది. నర్సింహులు బాలిక మెడలోని చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం ఏమీ ఎరగనట్లు.. బాలిక మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించింది. బాలిక ప్రేమించిన వ్యక్తిపై నేరం మోపేందుకు శతవిధాలా ప్రయత్నించింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అఫ్సర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలిక, ఆమె తల్లి సెల్ ఫోన్ కాల్‌ డేటా సహా హత్య జరిగిన చోట సిగ్నళ్ల సాంకేతిక ఆధారంగా నిందితుడు నర్సింహులును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటను పోలీసులు తీవ్రంగా భావించారు. నిందితురాలు బుజ్జమ్మ, ఆమె ప్రియుడు గొల్ల నర్సింహులును అరెస్టు చేశారు. ఏ-1గా నర్సింహులు, ఏ-2గా బుజ్జమ్మను చేర్చారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Also Read

అదనపు కట్నం, అత్తింటి వేధింపులు.. మూడు నెలల గర్భిణీ ఆత్మహత్య

Delhi News: ఢిల్లీలో అనుమానాస్పద బ్యాగ్ కలకలం.. బ్యాగ్ లో భారీగా పేలుడు పదార్థాలు..!

Telangana: రేపు(శుక్రవారం) ఆ జిల్లాల్లో సెలవు ప్రకటించిన కలెక్టర్లు..

రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..