Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Organ donation: పుట్టెడు దుఃఖంలోనూ వారికి సంతోషం పంచారు.. బిడ్డ మరణంలోనూ మానవత్వం చాటారు..

అతనొక టీనేజ్‌ కుర్రాడు. చదువే అతని లోకం. అతని తల్లిదండ్రులకు పిల్లాడే ప్రపంచం. కళ్ల ముందు బిడ్డ ఎదుగుతుంటే ఆ పేరెంట్స్ మురిసిపోయారు

Organ donation: పుట్టెడు దుఃఖంలోనూ వారికి సంతోషం పంచారు.. బిడ్డ మరణంలోనూ మానవత్వం చాటారు..
Follow us
Basha Shek

|

Updated on: Feb 17, 2022 | 7:24 PM

అతనొక టీనేజ్‌ కుర్రాడు. చదువే అతని లోకం. అతని తల్లిదండ్రులకు పిల్లాడే ప్రపంచం. కళ్ల ముందు బిడ్డ ఎదుగుతుంటే ఆ పేరెంట్స్ మురిసిపోయారు. రోజూ స్కూల్‌కు వెళ్లి వస్తుంటే సంబురపడిపోయారు. పిల్లాడి భవిష్యత్‌ను ఘనంగా ఊహించుకున్నారు. తమ బిడ్డ చేతికి అందితే తమ కష్టాలన్నీ తీరుతాయని ఆశపడ్డారు. కాని దేవుడు చిన్నచూపుచూశాడు. స్కూల్‌కు వెళ్తుంటే వ్యాన్‌ రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. శరీరంలో అవయవాలన్నీ బాగున్నా.. బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. 14 ఏళ్ల వయసులోనే నిండునూరేళ్లు నిండిపోయాయి. అయితే తన చావును సార్థకం చేసుకున్న ఆ టీనేజర్‌ తన అవయవాలను దానం చేసి చిరంజీవుడిగా నిలిచిపోయాడు. అసలు విషయంలోకి వెళితే..

ఐదుగురి జీవితాల్లో వెలుగు..

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం టీ మాదాపుర్ గ్రామం. రాములు-మంజుల దంపతులు వ్యవసాయం చేస్తుంటారు. కూతురు, కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. 9తరగతి చదువుతున్న లోకేష్.. పక్క గ్రామంలో ప్రతి రోజు బస్సులో స్కూల్‌కు వెళ్లి వస్తుంటాడు. లోకేష్ సోమవారం ఉదయం రోజూ మాదిరే అమ్మ, నాన్నకు టాటా చెప్పి.. స్కూల్‌ బ్యాగ్‌ భుజాన వేసుకొని గడప దాటాడు. అంతే ఉదయాన్నే లోకేష్‌ను వ్యాన్‌ ఢీ కొట్టింది. ఈ విషయం పేరెంట్స్‌కు తెలియగానే అపస్మారక స్థితిలోకి చేరిన బిడ్డను హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్నా.. మెరుగుపడకపోవడంతో.. వైద్యులూ చేతులెత్తాశారు. పైగా తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ.. అవయవ దానంతో ఐదుగురి ప్రాణాలు నిలపవచ్చని సూచించారు. బిడ్డను కోల్పోయిన దుఖంలోనూ పెద్ద మనస్సు చాటుకున్నారు రాములు-మంజుల దంపతులు. తమ బిడ్డ అవయవాలు దానం చేసి ఐదుగురి ప్రాణాలు కాపాడారు. గుండె, కళ్లు, లివర్, కిడ్నీలను దానం చేశారు లోకేశ్ తల్లిదండ్రులు. ఇంటికి చేరిన లోకేష్ అంత్యక్రియలకు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై.. కన్నీటి వీడ్కోలు పలికారు.  లోకేశ్ తల్లిదండ్రులను విషాదంలోనూ ఎంతో మంచి మనసుతో ఆలోచించారు. తమ బిడ్డ అవయవాలను దానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తమ బిడ్డను ప్రత్యక్షంగా చూసుకోలేకపోయినా ఆ ఐదుగురిలో చూసుకుంటున్నారు. నిజంగా వారిది ఎంత గొప్ప మనసో..

Also Read:Kodali Nani: వైఎస్ వివేకా హత్య చార్జీషీట్‌లో ఏముందో బయటకు వెల్లడించాలి.. చంద్రబాబుపై మళ్లీ మండిపడ్డ కొడాలి నాని..

Supreme Court: ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్‌.. కీలక తీర్పు వెలువరించిన సుప్రీం..

Adah Sharma: డస్ట్‌బిన్‌ తో డ్యాన్స్‌ చేసిన హార్ట్‌ ఎటాక్‌ హీరోయిన్‌ .. నెటిజన్లు ఏమంటున్నారంటే..