Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: వారు సర్వనాశనమై పోతారు.. మంచు మోహన్ బాబు శాపనార్థాలు

Mohan Babu: 'సన్‌ ఆఫ్‌ ఇండియా' (Son of India)సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టీవీ 9 కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సోషల్ మీడియా(Social Media)లో వచ్చే ట్రోలింగ్స్ పై షాకింగ్ కామెంట్స్..

Mohan Babu: వారు సర్వనాశనమై పోతారు.. మంచు మోహన్ బాబు శాపనార్థాలు
Mohan Babu
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2022 | 7:04 PM

Mohan Babu: ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ (Son of India)సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టీవీ 9 కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సోషల్ మీడియా(Social Media)లో వచ్చే ట్రోలింగ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను అసలు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను ట్రోలింగ్స్ ను చూడనని.. అప్పుడప్పుడు ఎవరైనా ట్రోలింగ్ గురించి చెబితే వింటానని అన్నారు. వాటిని చూసినప్పుడు తనకు చాలా బాధకలుగుతుందని..  అలా ట్రోల్స్ చేసేవారికి అక్కలుంటారు, భార్య, ఫ్యామిలీ సభ్యలంటారు.. అయినప్పటికీ ఎదుటివారిని ట్రోల్ చేస్తుంటారు. అలాంటి వారు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు.. కానీ ఎదుటివారిన  ఇబ్బంది పెట్టి..పొందే ఆనందం తాత్కాలికమని చెప్పారు.

ఏనుగులు మార్గంలో వెళ్తుంటే.. కుక్కలు మొరుగుతున్నాయని.. ట్రోలింగ్  నేను చూడను.. ఇది వాస్తవం.. ట్రోల్స్‌ చేయించేవాళ్లు  ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.. అలాంటివారు సర్వనాశనమైపోతారంటూ శాపం కూడా పెట్టారు మోహన్ బాబు. అంతేకాదు ట్రోల్స్, మీమ్స్ సరదాగా నవ్వుకునేలా ఉండాలే త‌ప్ప‌..ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండ‌కూడ‌దు’ అని మోహన్ బాబు  అన్నారు.

Also Read:  క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. జనసైనికుల కోసమే భీమా పథకం ..పవన్ కళ్యాణ్

మరో ఆసక్తికర యాక్షన్ మూవీతో రానున్న స్పైడ‌ర్ మ్యాన్ ఫెమ్ టామ్ హోలెండ్ .. అన్ ఛార్టెడ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..