SebastianPC524: కుర్రహీరో కిరణ్ అబ్బవరం మూవీ నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘హేలీ’ పాట
టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న కుర్ర హీరోలు చాలా మంది ఉన్నారు.. వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యంగ్ హీరో నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు.
SebastianPC524: టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న కుర్ర హీరోలు చాలా మంది ఉన్నారు.. వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యంగ్ హీరో నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్ ఉన్న కుర్రాడని కిరణ్ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు – మాసు, యూత్ – ఫ్యామిలీ.. అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ‘సెబాస్టియన్ పిసి 524’సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కిరణ్. ‘సెబాస్టియన్ పిసి524′ సినిమాలో కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ నెల 24న సినిమా విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమానుంచి అందమైన మెలోడీని విడుదల చేశారు మేకర్స్. నీ మాట వింటే రాదా మైమరపే.. నీ పేరు వింటే రాదా మైమరపే.. నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లే..’ అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను అలరిస్తోంది. జిబ్రాన్ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. సింగర్ కపిల్ కపిలాన్ ఆలపించగా.. భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. ఈ సినిమాలో రే చీకటి తో బాధపడే యువకుడిగా నటించాడు కిరణ్. ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో హీరో చెప్పే డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. సినిమాపై టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు విడుదలైన పాట కూడా శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో కిరణ్ మరో విజయం అందుకోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
మరిన్ని ఇక్కడ చదవండి :