ప్రేమ జంట దాడిలో గాయపడ్డ యువకుడు మృతి

రోజురోజుకు నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా.. భయం లేకుండా పోతోంది. అసభ్యకరంగా ప్రవర్తిస్తోన్న ఓ జంటను నిలదీసినందుకు ఓ యువకుడు బలయ్యాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డుపై జరిగిన ఈ ఉదంతంలో తీవ్రంగా గాయపడ్డ సాయిసాగర్ అనే యువకుడు.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలువిడిచాడు. సాయిసాగర్ అతని స్నేహితులతో కలిసి నెక్లసె రోడ్డులో బర్త్ డే పార్టీ చేసుకునేందుకు వెళ్లాడు. అయితే అక్కడ పలు కేసుల్లో నిందితుడైన జునైద్ అలియాస్ […]

ప్రేమ జంట దాడిలో గాయపడ్డ యువకుడు మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2019 | 11:53 AM

రోజురోజుకు నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా.. భయం లేకుండా పోతోంది. అసభ్యకరంగా ప్రవర్తిస్తోన్న ఓ జంటను నిలదీసినందుకు ఓ యువకుడు బలయ్యాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డుపై జరిగిన ఈ ఉదంతంలో తీవ్రంగా గాయపడ్డ సాయిసాగర్ అనే యువకుడు.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలువిడిచాడు.

సాయిసాగర్ అతని స్నేహితులతో కలిసి నెక్లసె రోడ్డులో బర్త్ డే పార్టీ చేసుకునేందుకు వెళ్లాడు. అయితే అక్కడ పలు కేసుల్లో నిందితుడైన జునైద్ అలియాస్ మొబిన్‌ ఓ యువతితో అసభ్యకర రీతిలో కనిపించడంతో సాయిసాగర్ అభ్యంతరం తెలిపాడు. దీంతో రెచ్చిపోయిన మొబిన్.. ముగ్గురు యువకులపై విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా కొట్టాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని గాయపడిన సాయిసాగర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

తీవ్రంగా గాయపడ్డ సాయిసాగర్ మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు విడిచాడు. యువకుడిపై దాడిచేసిన మొబిన్‌ను పోలీసుల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే నిందితుడిపై ఇప్పటికే 16 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు మిర్యాలగూడలో నమోదైన పలు కేసుల్లో మొబిన్ నిందితుడని, వాటితో పాటు పీడీ యాక్ట్ కూడా ఉందని.. పోలీసుల విచారణలో వెల్లడైంది.

సాయిసాగర్ విషయంలో పోలీసుల ప్రవర్తన అతని బంధువులు తప్పుపడుతున్నారు. పోలీసుల ఎదుటే మొబిన్.. సాగర్‌ను కొడుతున్నా పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఇరవై రోజుల క్రితమే సాయి సాగర్ వివాహమైంది. ఇంతలోనే హత్యకు గురికావడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. మొబిన్‌ను తమకు అప్పగిస్తే తామే.. శిక్షిస్తామంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.