నక్సల్స్ దుశ్చర్య.. జనావాసంలో ఓపెన్ ఫైర్.. కానిస్టేబుల్ సహా వ్యక్తి మృతి
జార్ఖండ్ రాష్ట్రంలో నక్సల్ దారుణానికి ఒడిగట్టారు. చైబస ప్రాంతంలోని కరైకెల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్‌తో పాటు ఓ సామాన్యుడిని చంపేశారు. వివరాల్లోకి వెళితే.. కరైకెల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నివాసంలో నక్సల్స్ ఉన్నారన్న సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన నక్సల్స్ వెంటనే ఓపెన్ ఫైరింగ్‌కు దిగారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌తో పాటు.. సామాన్య పౌరుడు ఒకరు మరణించారు. జనావాసంలో ఉండటంతో.. పోలీసులు […]

జార్ఖండ్ రాష్ట్రంలో నక్సల్ దారుణానికి ఒడిగట్టారు. చైబస ప్రాంతంలోని కరైకెల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్‌తో పాటు ఓ సామాన్యుడిని చంపేశారు. వివరాల్లోకి వెళితే.. కరైకెల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నివాసంలో నక్సల్స్ ఉన్నారన్న సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన నక్సల్స్ వెంటనే ఓపెన్ ఫైరింగ్‌కు దిగారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌తో పాటు.. సామాన్య పౌరుడు ఒకరు మరణించారు. జనావాసంలో ఉండటంతో.. పోలీసులు ఎదురుకాల్పులు చేపట్టకుండా.. నక్సల్స్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు నక్సల్స్ కోసం గాలింపు చేపడుతున్నారు.