గ్రేటర్ నోయిడాలో చైనీస్ మహిళపై వ్యక్తి దాడి..
ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించింది. అయితే తొలుత విధించిన లాక్‌డౌన్ సమయంలో దేశంలో క్రైం రేటు చాలా తగ్గింది. కానీ ఆ తర్వాత లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులతో మళ్లీ క్రైం రేటు కూడా పెరుగుతోంది. తాజాగా యూపీలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఓ చైనీస్ మహిళపై దాడి జరిగింది. తన సొంత సోసైటీకి చెందిన వ్యక్తి దాడి చేశాడని […]

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించింది. అయితే తొలుత విధించిన లాక్‌డౌన్ సమయంలో దేశంలో క్రైం రేటు చాలా తగ్గింది. కానీ ఆ తర్వాత లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులతో మళ్లీ క్రైం రేటు కూడా పెరుగుతోంది. తాజాగా యూపీలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఓ చైనీస్ మహిళపై దాడి జరిగింది. తన సొంత సోసైటీకి చెందిన వ్యక్తి దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీధి కుక్కలకు ఆహారాన్ని అందిచే సమయంలో తనపై ఓ వ్యక్తి దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నగరంలోని బేటా-2 సోసైటీకి చెందిన వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై సెక్షన్ 354బీ,504,ఐపీసీ సెక్షన్ 323 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.