పోలీసుల భారీ ఆపరేషన్.. 2179 కిలోల డ్రగ్స్ సీజ్..
ఓ వైపు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంటే.. మరోవైపు డ్రగ్స్ సప్లైయర్స్ మాత్రం.. ఇదే అదనుగా.. గుట్టుచప్పుడు కాకుండా భారీగా డ్రగ్స్ తరలించేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. ఒక్క హర్యానా రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గడిచిన రెండు నెలలుగా.. లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. పోలీసులకు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,179కిలోల నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని […]

ఓ వైపు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంటే.. మరోవైపు డ్రగ్స్ సప్లైయర్స్ మాత్రం.. ఇదే అదనుగా.. గుట్టుచప్పుడు కాకుండా భారీగా డ్రగ్స్ తరలించేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. ఒక్క హర్యానా రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గడిచిన రెండు నెలలుగా.. లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. పోలీసులకు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,179కిలోల నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని పేర్కొన్నారు. గడిచిన రెండు నెలల్లో మొత్తం 326 కేసులు డ్రగ్స్‌కు సంబంధించినవి నమోదయ్యాయని.. 506 మందిని అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కేసులన్నీ మార్చి 23 నుంచి మే 23 మధ్యలో అయ్యాయని తెలిపారు. ఇక పట్టుబడిన వాటిలో 288 కిలోల గంజాయి, 1341 కిలోల పప్పీ హస్క్, 14 కిలోల హెరాయిన్,11 కిలోల ఓపియమ్, 331 కిలోల గంజాయి పట్టీ, 56 కిలోల చరస్, 844 కిలోల స్కాక్,23 కిలోల దోడా పోస్ట్,115 కిలోల ఓపియమ్ ప్లాంట్స్ స్వాధీనం చేసుకున్నామని.. అంతేకాకుండా 92305 ఫార్మా ట్యాబ్లెట్స్,1565 సిరప్‌లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వివరించారు.