Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noida Case: సాఫ్ట్‌వేర్ భార్యపై అనుమానం…భర్త ఏం చేశారో చూడండి

భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను భర్త అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. సెక్టార్ 15లో నివాసం ఉంటున్న నూరుల్లా హైదర్, భార్య ఆస్మా ఖాన్ పై సుత్తితో దాడి చేసి హత్య చేశాడు. కుమారుడి ఫిద్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నూరుల్లాను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Noida Case: సాఫ్ట్‌వేర్ భార్యపై అనుమానం...భర్త ఏం చేశారో చూడండి
Noida Murders Case
Follow us
Anand T

|

Updated on: Apr 05, 2025 | 5:18 PM

ప్రస్తుత కాలంలో జరుగుతున్న దుర్ఘటనలు చూస్తుంటే రోజురోజుకు సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు, మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి. భార్య-భర్తలు, తల్లి-కొడుకులు, రక్త సంబంధాల మధ్య మమకారం తగ్గిపోతుంది. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తున్నారు. క్షణికావేశంలో ఎల్లకాలం తోడుగా ఉంటానని ఏడడుగులు నడిచి వచ్చిన భార్యలనే కైలాసానికి పంపుతున్నారు. ఇక్కడ మనం తెలుసుకోబోయేది కూడా  ఇలాంటి ఓ ఘటనే. నోయిడాలోని సెక్టార్ 15లో నివాసం ఉంటున్న నూరుల్లా హైదర్..భార్య ఆస్మా ఖాన్ కు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు.

నూరుల్లా హైదర్, ఆస్మా ఖాన్‌కు 2005లో వివాహం జరిగింది. వీళ్లు నోయిడాలోని సెక్టార్ 15లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, కూతురు 8వ తరగతి చదువుతోంది. సెక్టార్ 62లోని ఒక ప్రైవేటు సంస్థలో ఆస్మా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది, భర్త నూరుల్లాకు ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్య, భర్తల గొడవలు జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త నూరుల్లా..ఆమెపై సుత్తితో దాడి చేసి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఘటనా సమయంలో అక్కడే ఉన్న కుమారుడు 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నూరుల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ తెలిపారు.

అయితే గత కొన్ని రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని..భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే ఆమెను భర్త హత్య చేసినట్టు తమ ప్రాథమిక విచారణలో రుజువైందని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..