AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. స్కార్పియో, ట్రక్కు ఢీకొని 9 మంది దుర్మరణం

స్కార్పియో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉత్తర్ ప్రదేశ్‌ ప్రతాప్‌గఢ్‌లో జరిగింది. మృతులంతా రాజస్థాన్ నుంచి బీహార్‌లోని తమ సొంత ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ ఘటనలో స్కార్పియో వాహనం నుజ్జు..

ఘోర ప్రమాదం.. స్కార్పియో, ట్రక్కు ఢీకొని 9 మంది దుర్మరణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2020 | 11:42 AM

Share

స్కార్పియో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉత్తర్ ప్రదేశ్‌ ప్రతాప్‌గఢ్‌లో జరిగింది. మృతులంతా రాజస్థాన్ నుంచి బీహార్‌లోని తమ సొంత ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ ఘటనలో స్కార్పియో వాహనం నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఉదయం 6 గంటల సమయంలో నవాబ్ గంజ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని వాజిద్‌పుర్‌లో లక్నో-ప్రయాగ్ రాజ్ హైవేపై ఈ యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతదేహాలను వెలికి తీసేందుకు చాలా ఇబ్బంది పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. భారీ వర్షం కురుస్తున్న కారణంగా స్కార్పియోను డ్రైవర్ అదుపు చేయలేకోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

Read More:

తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్‌లైన్స్‌.. ఇంట్లో ఇలా ఉండాలి..

Follow Us