విశాఖ డెయిరీ డైరెక్టర్‌పై హత్యాయత్నం కేసులో పురోగతి

విశాఖ డెయిరీ డైరెక్టర్‌ సత్యనారాయణపై హత్యాయత్నం కేసులో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ముగ్గురు గ్రామ వాలంటీర్లు కూడా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది.

విశాఖ డెయిరీ డైరెక్టర్‌పై హత్యాయత్నం కేసులో పురోగతి
Follow us

|

Updated on: Jun 05, 2020 | 10:45 AM

విశాఖ డెయిరీ డైరెక్టర్‌ సత్యనారాయణపై హత్యాయత్నం కేసులో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ముగ్గురు గ్రామ వాలంటీర్లు కూడా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. నాలుగురోజుల క్రితం అచ్యుతాపురం మండలం నునపర్తిలో.. డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణపై దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో దాడికి వినియోగించిన ఆటోను పోలీసులు సీజ్‌ చేశారు.

వాలంటీర్ల అక్రమాలపై నిలదీసినందుకే హత్యాయత్నానికి ఒడిగట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల గ్రామ వాలంటీర్లు దాడులు, వేధింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓ వాలంటీర్‌ వేధింపులు భరించలేక సన్యాసినాయుడు అనే డ్రైవర్‌ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి నిర్మాణానికి అడ్డుపడడమే కాకుండా 50వేల రూపాయలను సదరు వాలంటీరు డిమాండ్‌ చేసినట్టుగా సన్యాసినాయుడు ఆత్మహత్యకు ముందు వాయిస్‌ రికార్డు చేసి కుటుంబసభ్యులకు పంపించాడు.