బెజవాడ గ్యాంగ్ వార్ : వెలుగులోకి సంచలన విషయాలు..
చాలా రోజుల తర్వాత బెజవాడలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఈ గొడవలో తోట సందీప్ అనే వ్యక్తి మరణించడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు క్రియేట్ చేసింది. విజయవాడలో మళ్లీ పాత పరిస్థితులు మొదలవుతాయన్న ఆందోళన స్థానికులు నుంచి వ్యక్తమవుతుంది.

చాలా రోజుల తర్వాత బెజవాడలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఈ గొడవలో తోట సందీప్ అనే వ్యక్తి మరణించడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు క్రియేట్ చేసింది. విజయవాడలో మళ్లీ పాత పరిస్థితులు మొదలవుతాయన్న ఆందోళన స్థానికులు నుంచి వ్యక్తమవుతుంది. కాగా ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే 25 మంది స్ట్రీట్ ఫైటర్లను అదుపులోకి తీసుకున్నారు.
పండు గ్యాంగ్ లో గుంటూరు, మంగళగిరికి చెందిన వ్యక్తుల ఉన్నట్టు పోలీసులు తేల్చారు. చనిపోయిన తోట సందీప్ పై గతం పలు పెట్టీ కేసులు నమోదయ్యాయని..అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు వాటిని కొట్టేసినట్టు గుర్తించారు. కోర్టు ఆదేశాలతో సందీప్ పై 2015 జులై నెలలో రౌడీ షీట్ కూడా తొలగించారు. పండుపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి. బెజవాడ రౌడీగా ఒక్కరే ఎదగాలన్న ఆలోచనా ధోరణే తాజా గ్యాంగ్ వార్ కి దారితీసిందన్న అనుమానాలు పోలీసు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ గొడవలో బ్లేడ్ బ్యాచ్ ప్రమేయంపై ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి. పండు పోస్ట్ చేసిన టిక్ టాక్ వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు సందీప్ ని పక్కా స్కెచ్ వేసి హత్యచేశారని అతడి భార్య తేజస్విని ఆరోపిస్తోంది.
