“బుట్టబొమ్మ”కు చాలా నచ్చిన క్రికెటర్ “ఆయనే…”
అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో సంచలన విషయం బయటపెట్టారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ముద్దుగుమ్మ... సోషల్ మీడియాలో మాత్రం టచ్‌లో ఉంటున్నారు. మీరు కోరిన ప్రశ్రలకు నా సమాధానాలు అంటూ తెగ సందడి చేస్తున్నారు.....

అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో సంచలన విషయం బయటపెట్టారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ముద్దుగుమ్మ… సోషల్ మీడియాలో మాత్రం టచ్‌లో ఉంటున్నారు. మీరు కోరిన ప్రశ్రలకు నా సమాధానాలు అంటూ తెగ సందడి చేస్తున్నారు. ఇదిలావుంటే… సరదగా కాసేపు ఫ్యాన్స్‌తో లైవ్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సూటిగా జవాబులు చెప్పారు. మీకు నచ్చిన .. మీరు మెచ్చిన అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నల వర్షం కురిపించారు. వాటికి అంతే వేగంగా చెప్పుకొచ్చారు పూజా.
అయితే ఓ నెటిజన్… మీ అభిమాన క్రికెటర్ ఎవరని అడిగారు. ఇందుకు ఇంకెవరు ఆయనే… అంటూ చెప్పారు. ఈతరంలో ఎంత మంది గొప్ప క్రికెటర్లు ఉన్నా ద్రవిడ్ ముందు సరిరారెవ్వరూ అని అన్నారు. ‘‘నాకు క్రికెట్ అంటే ఇష్టం. షూటింగ్‌ల్లో ఎంత బిజీగా ఉన్నా మ్యాచ్ ఉందంటే కనీసం స్కోర్ అయినా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటా… ద్రవిడ్‌కు నేను పెద్ద ఫ్యాన్… ఈతరం క్రికెటర్లలో ధోని, కేఎల్ రాహుల్ ఆట తీరును ఇష్టపడతాను.. అయితే ఎంత మంది ప్రతిభావంతులు ఆటలోకి అడుగు పెట్టినా.. ద్రవిడ్ కూల్, క్లాసికల్ ఆట ముందు ఎవరూ సరితూగలేరు’’ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.