AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగన్‌వాడీల్లో ‘నాడు–నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు-నేడు కార్యక్రమాలను అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ చేపట్టాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్షా

అంగన్‌వాడీల్లో ‘నాడు–నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 05, 2020 | 6:41 PM

Share

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు – నేడు కార్యక్రమాలను అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ చేపట్టాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 24 వేల అంగన్‌వాడీ భవనాల్లో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు.

అన్ని అంగన్‌వాడీల్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని, మంచి పౌష్టికాహారాన్ని తల్లులకు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. గర్భవతులకు, తల్లులకు, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం, తాడేపల్లిలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు ఇతర అధికారులు హాజరు అయ్యారు.

కాగా.. అంగన్‌వాడీల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని, ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఫ్రిజ్, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, రంగులు, బ్లాక్‌ బోర్డులు, ప్రహరీగోడ సహా కావాల్సిన మరమ్మతులు చేసి, సదుపాయాలను కల్పించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఏపీలోని ప్రీ స్కూల్స్ లో అమలుపరుస్తున్న విధానంలోకి.. అంగన్‌వాడీ స్కూళ్లన్నీ కూడా రావాలని సీఎం పేర్కొన్నారు. నాడు – నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, అదే తరహాలో అంగన్‌వాడీల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సదుపాయాలు కల్పించాలని సూచించారు.

Follow Us
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
దుబాయ్‌లో క్షిపణి దాడి హెచ్చరిక జారీ
దుబాయ్‌లో క్షిపణి దాడి హెచ్చరిక జారీ
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
చిన్నారుల ముక్కు, చెవుల్లో నూనె వేస్తున్నారా? డాక్టర్ల హెచ్చరిక!
చిన్నారుల ముక్కు, చెవుల్లో నూనె వేస్తున్నారా? డాక్టర్ల హెచ్చరిక!
జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
మొబైల్ చూస్తూ టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
మొబైల్ చూస్తూ టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
క్రూరత్వం పరాకాష్ఠ.. అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం..!
క్రూరత్వం పరాకాష్ఠ.. అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం..!