Cyber Crime: రోజుకో కొత్త రూపం దాల్చుతోన్న సైబర్ నేరాలు.. తాజాగా నమోదైన ఈ కేసులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు..
Cyber Crime: సైబర్ నేరాలు రోజుకో కొత్త రూపం దాల్చుతున్నాయి. పోలీసులు, సైబర్ నిపుణులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అలాగే ఎన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్లు కొత్త దారి...
Cyber Crime: సైబర్ నేరాలు రోజుకో కొత్త రూపం దాల్చుతున్నాయి. పోలీసులు, సైబర్ నిపుణులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అలాగే ఎన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్లు కొత్త దారి వెతుక్కుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. సైబర్ క్రైమ్ ఆఫీసులో ప్రతీ రోజూ ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. తాము సైబర్ నేరాల బారిన పడ్డామంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఇలాంటి మూడు కొత్త సైబర్ నేరాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..
డీజీపీ ఫొటోతోనే బురిడి కొట్టించారు..
ఓ సైబర్ మూట ఏకంగా తెలంగాణ డీజీపీ ఫొటోను ఉపయోగించే నేరగాలకు పాల్పడుతుంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోను సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు. మహేందర్ రెడ్డి పేరుతో ఓ ఫేక్ ఐడీని ఓపెన్ చేసి.. అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయని మెసేజ్‌లు చేస్తున్నారు. దీంతో కొందరు వెనుకాముందు చూసుకోకుండా డబ్బులు పంపిచేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును సుమోటోగా స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ పేరుతో..
హైదరాబాద్‌కు చెందిన ఇషిత రెడ్డి అనే యువతికి యూకేలోని ఓ యూనివర్సిటీలో సీటు లభించింది. దీంతో యూనివర్సిటీ ఫీజు కోసమని వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా రూ. 2 లక్షలు పంపించింది. ఇషిత ఈ లావాదేవీని తన డెబిట్ కార్డు ద్వారా జరిపింది. అయితే కార్డు వివరాలను దొంగలించిన సైబర్ నేరగాళ్లు ఖాతాలో ఉన్న మరో రెండు రూ. రెండు లక్షలను కాజేశారు. దీంతో ఒక్కసారి షాక్‌కి గురైన సదరు యువతి సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. ఇంతకీ యువతి డెబిట్ వివరాలను సైబర్‌నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
డబ్బులు డెబిట్ అయ్యాయంటూ, మోసం..
మెహిదీపట్నంలో నివాసం ఉంటున్న అబ్దుల్ సమద్ అనే వ్యక్తికి బ్యాంకు ఖాతా నుంచి రూ. 20,000 డెబిట్ అయ్యాయని మెసేజ్ వచ్చింది. అనంతరం సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ప్రతినిధుల పేరిట సమద్‌కు ఫోన్ చేసి డెబిట్ కార్డు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఓటీపీ తెలుసుకొని బ్యాంకులో ఉన్న మొత్తాన్ని కాజేశారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన సమద్ సైబర్ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేశారు.
Also Read: దాసరి నారాయణ రావు కుమారులపై పోలీస్ కేసు.. చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు.
Tirupati: తిరుపతిలో కలకలం.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతిపై అత్యాచారం.. ఆ తర్వాత..
Online Gaming: ఆన్‌లైన్ గేమ్ వ్యసనంతో 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. మమ్మీ సారీ అంటూ..