AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: తిరుపతిలో కలకలం.. కూల్‌డ్రింక్‌‎లో మత్తుమందు కలిపి యువతిపై అత్యాచారం.. ఆ తర్వాత..

Andhra Pradesh Crime: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో యువతిపై.. ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం

Tirupati: తిరుపతిలో కలకలం.. కూల్‌డ్రింక్‌‎లో మత్తుమందు కలిపి యువతిపై అత్యాచారం.. ఆ తర్వాత..
Andhra Pradesh Crime
Shaik Madar Saheb
|

Updated on: Jul 31, 2021 | 1:13 PM

Share

Andhra Pradesh Crime: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో యువతిపై.. ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. ముందు నమ్మించి ఆ తర్వాత మత్తు మందిచ్చి ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు.. ఓ వ్యక్తిపై యువతి(19) అలిపిరి పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఓ యువతి తండ్రి ఏడేళ్ల కిందట ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించింది. మంగళం బీటీఆర్‌ కాలనీకి చెందిన కుటుంబ స్నేహితుడి ఇంట్లో ఆమె జీవనం సాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన.. నాగేంద్రబాబు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది.

28వ తేదీ తనకు మాయమాటలు చెప్పి నాగేంద్రబాబు శ్రీనివాసం సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడని.. ఆ తర్వాత తనకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చాడని పేర్కొంది. అనంతరం అత్యాచారానికి పాల్పడిడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా వీడియోలు కూడా తీశాడని యువతి అలిపిరి పోలీసులకు వెల్లడించింది. తాను స్పృహ కోల్పోయిన అనంతరం ఈ ఉదంతానికి పాల్పడ్డాడని తెలిపింది.

యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవేంద్రకుమార్‌ వెల్లడించారు. నిందితుడు నాగేంద్రబాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు వివరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. అనంతరం యువతి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read:

Free Biryani: ఫ్రీ బిర్యానీ కోసం కక్కుర్తి.. పీకల్లోతు వివాదంలో ఆ ఐపీఎస్ అధికారిణి

మావోల కొత్త పంథా..సెక్యూరిటీ దళాలపై నిఘాకు డ్రోన్లను వినియోగిస్తున్న మావోయిస్టులు.. గడ్చిరోలిలో భద్రత మరింత కట్టుదిట్టం

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్