Free Biryani: ఫ్రీ బిర్యానీ కోసం కక్కుర్తి.. పీకల్లోతు వివాదంలో ఆ ఐపీఎస్ అధికారిణి

Woman IPS officers free biryani order: ఆమె ఓ ఐపీఎస్ అధికారిణి.. కానీ బిర్యానీ కోసం కక్కుర్తి పడింది. చివరకు పికల్లోతు వివాదంలో కూరుకుపోయింది. చివరకు ప్రభుత్వమే స్పందించి

Free Biryani: ఫ్రీ బిర్యానీ కోసం కక్కుర్తి.. పీకల్లోతు వివాదంలో ఆ ఐపీఎస్ అధికారిణి
Biryani
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 31, 2021 | 11:37 AM

Woman IPS officers free biryani order: ఆమె ఓ ఐపీఎస్ అధికారిణి.. కానీ బిర్యానీ కోసం కక్కుర్తి పడింది. చివరకు పికల్లోతు వివాదంలో కూరుకుపోయింది. చివరకు ప్రభుత్వమే స్పందించి ఆ మహిళా ఐపీఎస్ అధికారి చేసిన నిర్వాకంపై విచారించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. మహారాష్ట్రలోని పూణే పరిధిలో డిప్యూటీ కమిషనర్‌ ర్యాంకులో మహిళా ఐపీఎస్‌ అధికారిణి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన సబార్డినేట్‌తో విశ్రాంబాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏ రెస్టారెంట్‌లో మంచి బిర్యానీ దొరుకుతుందనేది అడిగి తెలుసుకున్నారు. దేశీ ఘీ రెస్టారెంట్‌‌లో మంచి బిర్యానీ దొరకుతుందని చెప్పడంతో.. అక్కడి నుంచి మటన్‌ బిర్యానీ తెప్పించాలని ఐపీఎస్ అధికారిణి కోరారు.

ఈ క్రమంలో రెస్టారెంట్‌ వాళ్లు డబ్బులు అడిగితే స్థానిక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడించాలంటూ హుకుం జారీ చేశారు. తమ పరిధిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందా..? ఎందుకు అంటు ఆమె సబార్డినేట్‌‌తో పేర్కొన్నారు. దానికి సబార్టినేట్ స్పందిస్తూ.. తాము ఎప్పుడు బయట నుంచి ఆహారం ఆర్డర్‌ చేసినా.. డబ్బులు చెల్లిస్తామటూ సమాధానమిచ్చారు. దీనిపై స్పందించిన మహిళా ఐపీఎస్‌.. మన పరిధిలో ఉన్న రెస్టారెంట్‌కు కూడా డబ్బులు చెల్లించాలా.. ఇదంతా అక్కడున్న ఇన్‌స్పెక్టర్‌ చూసుకుంటాడంటూ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ తతాంగమంతా మహారాష్ట్ర హోం మంత్రి వాల్సే పాటిల్ దగ్గరికి చేరింది. వెంటనే ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పూణే పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. విచారణ అనంతరం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి తెలిపారు.

ఈ విషయంపై ఐపీఎస్‌ అధికారిణి స్పందించారు. తన ఆడియో క్లిప్‌ను కొంతమంది మార్ఫింగ్‌ చేశారంటూ ఆరోపించారు. ఇదంతా సీనియర్ పోలీసు అధికారులను బదిలీ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు బయటపడిందనని.. కుట్రతోనే ఇలా చేశారని పేర్కొన్నారు. తాను ఇక్కడ ఉద్యోగంలో చేరిన తరువాత కొంతమంది సీనియర్ల ఆర్థిక ప్రయోజనాలు ఆగిపోయాయని.. దీంతో తనను తొలగించాలనే అక్కసుతో ఇదంతా చేశారని పేర్కొన్నారు. దీనిపై సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించనున్నట్లు మహిళా ఐపీఎస్ అధికారిణి తెలిపారు.

Also Read:

Viral News: బరాత్‌తో బయలుదేరిన వరుడు.. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్..

Covid-19 Vaccine: దేశంలో మహాయజ్ఞంలా కొవిడ్ వ్యాక్సినేషన్.. శుక్రవారం ఒక్కరోజే అర కోటికి పైగా..