Viral News: బరాత్‌తో బయలుదేరిన వరుడు.. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్..
Marriage Viral News: పెళ్లంటే ఎంత హడావుడి ఉంటుందో మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అందరినిలానే ఈ వరుడు కూడా
Marriage Viral News: పెళ్లంటే ఎంత హడావుడి ఉంటుందో మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అందరినిలానే ఈ వరుడు కూడా తన పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాడు. ఆ సమయం రానే వచ్చింది. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి. బాజాభజంత్రీలతో వరుడు ఇంటి నుంచి వధువు ఇంటికి బయలు దేరాడు. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తున్న వరుడికి ఆరోగ్య శాఖ అధికారులు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వరుడికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కొన్ని గంటల్లో ఇద్దరు ఒక్కటవుతున్నారని అనుకుంటున్న సమయంలో.. పెళ్లి వాయిదా పడింది. పెళ్లి మండపంలో ఉండాల్సిన వరుడు చివరికి హోం ఐసోలేషన్‌కు వెళ్లాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాలు.. ఉత్తరాఖండ్‌లోని ఖటిమా ప్రాంతంలోని ఇస్లాంనగర్‌కు చెందిన యువతితో.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లా చందోయ్ గ్రామానికి చెందిన ముంతాజ్‌కు వివాహం నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే.. వరుడు, అతని కుటుంబసభ్యులు బరాత్ నిర్వహించుకుంటూ గురువారం వధువు గ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దుల్లో వీరిని పోలీసులు అడ్డగించారు. కరోనా రిపోర్టు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని వెల్లడించారు. దీంతో పెళ్లికి వెళుతున్న వారంతా కరోనా యాంటిజెన్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రాగా.. ఒక్క వరుడికి మాత్రమే పాజిటివ్ వచ్చింది.
వరుడికి పాజిటివ్ రావడంతో.. కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు మూడుసార్లు పరీక్షలు చేశారు. ఈ అన్ని పరీక్షల్లో కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో వరుడికి కరోనా సోకినట్లు నిర్ధారించి.. వరుడు బంధువులను వెనక్కి పంపించారు. వరుడిని ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. అయితే.. వరుడు, వధువు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. కాగా.. ఈ సంఘటన ఇరు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. దీంతోపాటు కరోనా వీరి పెళ్లి పాలిట శాపంగా మారిందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: