Chittoor Murder : చిత్తూరు కలెక్టరేట్ అటెండర్ మృతిలో కొత్త ట్విస్ట్.. ప్రియుడి ప్రేమ కోసం భర్త గొంతు నులిమి..

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Jul 29, 2021 | 3:47 PM

చిత్తూరు కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న వాసు మృతిపై ఆనుమానాలు మొదలయ్యాయి. ప్రియుడి ప్రేమ కోసం భర్తనే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు...

Chittoor Murder : చిత్తూరు కలెక్టరేట్ అటెండర్ మృతిలో కొత్త ట్విస్ట్.. ప్రియుడి ప్రేమ కోసం భర్త గొంతు నులిమి..
Vasu Murder Mystery

Follow us on

Murder Mystery : చిత్తూరు కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న వాసు మృతిపై ఆనుమానాలు మొదలయ్యాయి. ప్రియుడి ప్రేమ కోసం భర్తనే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. భర్త వాసును భార్య స్వప్నప్రియ గొంతు నులిమి హతమార్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లెకు చెందిన వాసు ఈనెల 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం భర్త వాసు గుండెపోటుతో చనిపోయినట్లు స్వప్నప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కట్టుకున్న భర్తను భార్యయే ప్రియుడి కోసం గొంతునులిమి చంపిందని బంధువులు, స్థానికులు ఆరోపించారు.

భర్త వాసును భార్య స్వప్నప్రియే చంపేసి.. గుండెపోటుతో మృతి చెందాడని నాటకం ఆడుతోందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన వాసు మెడపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. దానికి తోడు పోస్టుమార్టం నివేదికలో కూడా వాసు మెడ ఎముకలు విరిగినట్లు స్పష్టమైంది. దాంతో భార్య స్వప్నప్రియపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లెలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం చిత్తూరు టూ టౌన్‌ పోలీసులు స్వప్నప్రియను అదుపులోకి తీసుకొని వాసు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. స్వప్నప్రియ భర్త వాసును హతమార్చడానికి ఎవరైనా సాయపడ్డారా…? లేక ఒంటరిగానే హతమార్చిందా..? హత్యకు కుట్రపన్నిందెవరు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మరోవైపు గ్రామస్తులు, బంధువులు మాత్రం వివాహేతర సంబంధమే వాసు హత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. స్వప్నప్రియ, ఆమె ప్రియుడు కలిసే ఈ దారుణహత్యకు పాల్పడి ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి 10 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై స్వప్నప్రియ నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read also : BJP : కూల్చివేతల్లో ఎంఐఎం ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపులు దుర్మార్గం : బండి సంజయ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu