మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ అరెస్ట్

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.

మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 13, 2020 | 4:48 PM

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్‌ సభ్యులు ముగ్గురిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న బోర్‌వెల్‌ వ్యాపారి గూడూరు మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో ఆహారంలో మత్తు మందు కలిపి..యజమానులు స్పృహ కోల్పోయాక పనిమనుషులు దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న వారంతా నేపాల్‌ వలస కూలీలుగా గుర్తించిన పోలీసులు నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు…వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని నేపాల్‌ సరిహద్దులోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లఖీమ్‌పూర్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వీరి నుంచి రూ.5.2 లక్షల నగదుతో పాటు రూ.20 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

నేపాల్‌లోని కైలాలి జిల్లా మోతీపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని లకమీచూహకు చెందిన నేత్రా బహదూర్‌ శశి అలియాస్‌ నేత్రా ఈ దోపిడీలో కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు సీపీ తెలిపారు. ఉపాధి కోసం భారత్‌కు వచ్చిన ఇతడు దేశంలోని ముఖ్యమైన నగరాల్లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో పనిచేశాడు. ఇదే క్రమంలోనే ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌ ప్రాంతంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో తమ్ముడు మనోజ్‌ బహదూర్‌ సాహీతో కలిసి పనికి కుదిరాడు.

అయితే, ఈజీమనీ కోసం అలవాటు పడిన నేత్రా…నేపాల్‌లోని తన సమీప గ్రామాలకు చెందినవారు హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాల్లో పనిమనుషులుగా, వాచ్‌మన్‌లుగా ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో వాకబు చేశాడు. వారితో పరిచయం పెంచుకొని సన్నిహితంగా ఉంటూ వారిని దొంగతనాలు, దోపిడీలకు ఎంచుకున్నాడు. తాను చెప్పినట్టుగా యజమానులకు ఇచ్చే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇస్తే మత్తులోకి జారుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉండే నగదు, విలువైన వస్తువులు ఓ బ్యాగ్‌లో చుట్టేసి తీసుకొచ్చేలా ప్లాన్‌ చేస్తాడు.

ఇదే క్రమంలో ముంబై, ఢిల్లీ, ఉదయ్‌పూర్, సూరత్‌లలో ఉండే తన గ్యాంగ్ ను హైదరాబాద్‌లో దింపాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 4న కూడా కోకాపేట గ్రామంలోని అరిస్టోస్‌ పోలోమిలో ఉంటున్న జి.కీర్తిరెడ్డి ఇంట్లోనూ దోపిడీకి పాల్పడ్డాడు. అలాగే ఈ నెల 5న బోర్‌వెల్‌ వ్యాపారి గుడూరు మధుసూదన్‌రెడ్డి ఇంట్లో కుటుంబసభ్యులకు అదే ఇంట్లో పనిమనిషిగా ఉన్న నేపాల్‌కు చెందిన జానకికి మార్గదర్శనం చేసి వారు తినే ఆహారం, టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు.

మధుసూదన్‌రెడ్డి ఇంట్లో దోపిడీ చేసిన వెంటనే నేపాలీ వాసులు రాజేందర్, దేవీరామ్‌ దమ్లా, జానకి, వినోద్‌ కమల్‌ షాహీ, భోజల్‌ బీక, మనోజ్‌ బహదూర్‌ సాహీ రెండు బృందాలుగా విడిపోయి ఢిల్లీ, ముంబై వైపు చెరి కొంత సొత్తు తీసుకొని పారిపోయారు. అయితే నేత్రతో పాటు ప్రకాష్‌ శషి అలియాస్‌ ప్రతాప్, సిటలావర్‌లు మరో బృందంగా ఏర్పడి మరికొంత సొత్తు, నగదుతో అద్దె వాహనంలో బయలుదేరారు. హైదరాబాద్‌ నుంచి నాందేడ్, ఇండోర్, లక్నో, లఖీమ్‌పూర ప్రాంతం మీదుగా నేపాల్‌కు వెళ్లాలనుకున్నారు. గతంలోనూ వీరు ఇలానే నేపాల్‌కు వెళ్లి అక్కడ సొత్తును, డబ్బులు పంచుకొని ఎవరి ఊళ్లకు వారు వెళ్లేపోయారు. ఇదంతా సర్ధుమణిపోయాక, మళ్లీ యథావిధిగా వ్యవహారాల్లోకి వెళ్లేవారు.

అయితే, ఈ దోపిడీని సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పది బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించారు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ పోలీసులను అలర్ట్ చేసిన పోలీసులు.. యూపీ–నేపాల్‌ సరిహద్దుగా ఉన్న లఖీమ్‌పూర్‌కు నేత్రా బృందం చేరుకోగానే అక్కడే మాటువేసి ఉన్న సైబరాబాద్‌ పోలీసుల బృందం నిందితులను పట్టుకుంది. పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితుల కోసం కూడా ఇతర బృందాలు గాలిస్తున్నాయని సీపీ సజ్జనార్‌ తెలిపారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో