రైతు భీమా సొమ్ము కోసం తల్లినే కడతేర్చిన కొడుకు
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. బంధాలన్నీ ఆర్థిక బంధాలుగానే మారుతున్నాయి. డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు.
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. బంధాలన్నీ ఆర్థిక బంధాలుగానే మారుతున్నాయి. డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. రైతుబీమా డబ్బుల కోసం కని పెంచిన తల్లినే హతమార్చాడు ఓ దుర్మార్గుడు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రైతుల సంక్షేమం దృష్ట్యా కేసీఆర్ సర్కార్ రైతు భీమా పథకాన్ని తీసుకువచ్చారు. అయితే, జిల్లాలోని కంగరి మండలం బాబులాగమ గ్రామానికి చెందిన తులసీ బాయ్ నివాసముంటోంది. తనకునర్న వ్యవసాయ భూమికి గానూ రూ. 5 లక్షల రైతుబీమా డబ్బులను ప్రకటించింది ప్రభుత్వం అయితే, ఈ డబ్బులు ఇవ్వాల్సిందిగా పెద్ద కొడుకు శంకర్ పవార్ తల్లిని వేధించాడం మొదలుపెట్టాడు. ఇందుకు తల్లి నిరాకరించడంతో మనుమడు పుండలిక్‌తో కలిసి బాబులాగమ గ్రామ శివారులో ఏడాది క్రితం తల్లిని దారుణంగా హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కొడుకు పవార్ శంకర్, హత్య చేసినట్లు తేలింది. కేవలం రైతుబీమా డబ్బుల కోసం హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.