లడాఖ్ ను అక్రమంగా ‘ఏర్పాటు చేసిన’ ఇండియా, చైనా ఆరోపణ

లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఇండియాఅక్రమంగా ‘ఏర్పాటు చేసిందని’ చైనా ఆరోపించింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని తాము గుర్తించబోమని తెలిపింది. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో భారత్ ఎనిమిదేసి బ్రిడ్జీలను నిర్మించిన సంగతి తెలిసిందే. వీటిని నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాలను తాము వ్యతిరేకిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ తెలిపారు. ఈ విధమైన చర్యలు ఉభయ దేశాల […]

లడాఖ్ ను అక్రమంగా 'ఏర్పాటు చేసిన' ఇండియా, చైనా ఆరోపణ
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 13, 2020 | 4:55 PM

లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఇండియాఅక్రమంగా ‘ఏర్పాటు చేసిందని’ చైనా ఆరోపించింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని తాము గుర్తించబోమని తెలిపింది. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో భారత్ ఎనిమిదేసి బ్రిడ్జీలను నిర్మించిన సంగతి తెలిసిందే. వీటిని నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాలను తాము వ్యతిరేకిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ తెలిపారు. ఈ విధమైన చర్యలు ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికే దోహదపడతాయన్నారు. స్సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలను మేం వ్యతిరేకిస్తున్నాం అని లిజియాన్ పేర్కొన్నారు. అయితే మరి మీరు చేస్తన్నదేమిటి అని భారత ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.