Nellore Murder: నెల్లూరు జిల్లా వైసీపీ కౌన్సిలర్ హత్య కేసులో ట్విస్ట్.. సీసీటీవీ ఫుటేజీతో వెలుగులోకి షాకింగ్ విషయాలు!

అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ హత్యను సీరియస్‌గా తీసుకున్న పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి హంతకుల కోసం వేట మొదలు పెట్టారు.

Nellore Murder: నెల్లూరు జిల్లా వైసీపీ కౌన్సిలర్ హత్య కేసులో ట్విస్ట్.. సీసీటీవీ ఫుటేజీతో వెలుగులోకి షాకింగ్ విషయాలు!
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 10, 2021 | 5:55 PM

Sullurpet Councillor Murder Mystery: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన మున్సిపల్‌ కౌన్సిలర్‌ సురేష్‌ హత్య కేసు సంచలనం రేపుతోంది. సూళ్లూరుపేటలో పట్టపగలు వైసీపీ కౌన్సిలర్ తాళూరు సురేశ్(40) దారుణ హత్యకు గురయ్యారు. కారు పార్క్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పుట్టినరోజు నాడే సురేష్ హత్యకు గురవడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ హత్యను సీరియస్‌గా తీసుకున్న పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి హంతకుల కోసం వేట మొదలు పెట్టారు. అయితే, బాలు అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేష్‌ కారును అనుసరిస్తూ వచ్చిన వ్యక్తిని బాలుగా పోలీసులు భావిస్తున్నారు.

హత్య జరిగిన ప్రాంతంలో సీసీటీవీని పరిశీలించారు పోలీసులు. కారులో కుటుంబంతో సహా సురేష్‌ వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫాలో అయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ వ్యక్తిని బాలుగా అనుమానిస్తున్నారు. సురేష్‌ ఇంట్లోనే పనిచేస్తున్నాడు బాలు. అయితే, ఈ హత్య బాలునే చేశాడా? లేక ఇంకెవరి పాత్ర అయినా ఉందా? బాలు హత్య చేస్తే ఎందుకు చేశాడని పోలీసులు ఆరా తీస్తున్నారు.

సోమవారం, అగస్టు 9 సురేష్ పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దైవ దర్శనం కోసం వెళ్లారు. అనంతరం సాయంత్రం సమయంలో తిరిగి సూళ్లూరుపేటకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఇంటి వద్ద దింపిన సురేష్.. సమీపంలోని రైల్వే కేబిన్ రోడ్డులో కారును పార్క్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని అగంతకులు సురేష్‌పై మారణాయుధాలతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఇంటి నుంచి పార్కింగ్‌ షెడ్‌కు వెళుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫాలో అయినట్టు తెలుస్తోంది. సురేష్‌ ఇంట్లో నమ్మకంగా ఉండే బాలు ఈ హత్య చేశాడని అనుమానిస్తున్నారు పోలీసులు.

అయితే, సీసీటీవీలో నమోదైన దృశ్యాల్లో ఉన్నది బాలునే అని చెబుతున్నారు. అయితే, సురేష్‌ ఇంట్లోనే ఉండే బాలు ఈ హత్య ఎందుకు చేశాడు ? ఎవరైనా బాలుతో ఈ హత్య చేయించారా ? ఏవైనా ఆర్థిక లావాదేవీల వ్యవహారం దాగి ఉందా ? లేదా మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పది టీమ్‌లు రంగంలోకి దిగినట్టు డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి చెప్తున్నారు. సురేష్‌ మర్డర్ తర్వాత బాలు అదృశ్యం కావడంతో పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అతడు చిక్కితే ఈ మర్డర్‌ మిస్టరీ మొత్తం వీడే అవకాశం ఉంది..

Read Also…  TRS vs Revanth: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నాలుక తెగ కోస్తాం.. రేవంత్‌రెడ్డికి తెలంగాణ మంత్రుల వార్నింగ్