Army Jawan: డ్యూటీకి బయలుదేరిన ఆర్మీ జవాన్ అదృశ్యం.. మిస్టరీగా మారిన నవీన్ కుమార్ మిస్సింగ్ కేసు..!
కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. తిమ్మక్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ (28).. గత ఆరు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు.
Army Jawan Missing: కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. తిమ్మక్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ (28).. గత ఆరు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. రాజస్థాన్ జోధ్ పూర్ లో విధులు నిర్వర్తిస్తున్న కెంగర్ల నవీన్ కుమార్. ఆర్మీ జవాన్. ఆగస్ట్ నాలుగున సెలవుపై ఇంటికి వచ్చిన నవీన్… తన సొంత గ్రామమైన కామారెడ్డి జిల్లా తిమ్మక్ పల్లిలో 25రోజులకు పైగా ఉన్నాడు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపాడు. తిరిగి విధుల్లో చేరేందుకు ఆగస్ట్ 29న ఇంటి నుంచి బయల్దేరాడు. అయితే, అప్పట్నుంచి కనిపించకుండా పోయాడు. జోద్‌పూర్‌కు రాలేడని ఆర్మీ అధికారులు తెలపడంతో.. తెలిసినవారి దగ్గర ఆరా తీశారు.. ఎక్కడా నవీన్ కుమార్ ఆచూకీ లభించకపోవడంతో.. కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు నవీన్ తల్లి మనెమ్మ.. కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి టౌన్ పోలీసులు.. నవీన్ మిస్సింగ్‌పై దర్యాప్తు ప్రారంభించారు.
కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు, అక్కడ్నుంచి జోథ్ పూర్ వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాడు నవీన్. కామారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సెక్కాడు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్.. నవీన్ కుమార్ ను అదే చివరిసారిగా చూడటం. ఇక, అప్పట్నుంచి అతన్నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యుల్లో కంగారు మొదలైంది. తిరిగి డ్యూటీలో చేరిన ప్రతీసారి ఫోన్ చేసి చెప్పే కొడుకు నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లి మనెమ్మ ఆగస్ట్ 30న ఆర్మీ అధికారులను సంప్రదించింది. ఇక్కడే గుండె పగిలే వార్త తెలిసింది. నవీన్ అసలు డ్యూటీలోనే చేరలేదని ఆర్మీ అధికారులు చెప్పడంతో కంగుతింది. నవీన్ కోసం కామారెడ్డి పరిసర ప్రాంతాలతోపాటు బంధువుల ఇళ్లకు వెదికింది. ఎలాంటి సమాచారం గానీ ఆచూకీ గానీ దొరకకపోవడంతో చివరికి కామారెడ్డి టౌన్ పోలీసులను ఆశ్రయించింది.
మరి, కామారెడ్డిలో హైదరాబాద్ బస్సెక్కిన నవీన్ ఏమైనట్లు? అటు జోథ్ పూర్ వెళ్లక… ఇటు ఇంటికీ రాక… ఎక్కడికి వెళ్లాడు. ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆర్మీ జవాన్ మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Also….