Pastor Joseph: మత ప్రబోధకుడిగా ప్రసంగాలు.. దేవుడి పేరుతో యువతులకి గాలెం.. పాస్టర్ నయవంచన ఎపిసోడ్‌‌లో నాయా కోణం..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 06, 2021 | 11:53 AM

మత ప్రబోధకుడిగా ప్రసంగాలు.. దేవుడి పేరుతో యువతులకి గాలెం.. ఆపై పెళ్లి మోసం.. ఇది పాస్టర్ జోసెఫ్‌ చీటింగ్ కథా చిత్రమ్‌. ఓ బాధితురాలి ఫిర్యాదుతో పాస్టర్ నయవంచన ఎపిసోడ్‌...

Pastor Joseph: మత ప్రబోధకుడిగా ప్రసంగాలు.. దేవుడి పేరుతో యువతులకి గాలెం.. పాస్టర్ నయవంచన ఎపిసోడ్‌‌లో నాయా కోణం..
Pastor Joseph

మత ప్రబోధకుడిగా ప్రసంగాలు.. దేవుడి పేరుతో యువతులకి గాలెం.. ఆపై పెళ్లి మోసం.. ఇది పాస్టర్ జోసెఫ్‌ చీటింగ్ కథా చిత్రమ్‌. ఓ బాధితురాలి ఫిర్యాదుతో పాస్టర్ నయవంచన ఎపిసోడ్‌ మొత్తం బయటికొచ్చింది. హైదరాబాద్‌ మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుతో గురుడు అరెస్ట్ అయ్యాడు. పాస్టర్ జోసెఫ్‌ అలియాస్ సాదు చిన్న వెంకటేశ్వర్లు. నేమ్‌ ఛేంజ్‌ చేసి ఫేమ్ అవ్వాలనుకున్నాడు. ఉప్పల్లో సొంతంగా గాస్పల్ చర్చి నిర్వహిస్తున్నాడు. మత ప్రబోధకుడి ముసుగలో అమాయక అమ్మాయిలను ట్రాప్ చేయడం హ్యాబీగా పెట్టుకున్నాడు. చెల్లి.. చెల్లి అంటూనే దగ్గరవుతూ లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నాడు. ఓ యువతికి దగ్గరైన జోసెఫ్‌ మూడుముళ్లు వేశాడు. ఆ తర్వాత మరోకరికి దగ్గరయ్యాడు. ఆమెను కూడా పెళ్లి చేసుకుని ఏకంగా ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో అవాక్కయిన బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది.

చీటింగ్‌ పాస్టర్‌పై మేడిపల్లి పీఎస్‌లో ఎమ్మార్పీఎస్‌ ఫిర్యాదు చేసింది. దీంతో జోసెఫ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అమ్మాయిల్ని ట్రాప్‌ చేయడం.. ఆపై పెళ్లి పేరుతో మోసం చేయడం జోసెఫ్‌కి అలవాటుగా మారింది. ఎదురు తిరిగితే బాధితురాలి కుటుంబంపై కేసులు పెట్టి ఎలా వేధిస్తున్నాడో తెలిస్తే మీరే షాక్ అవుతారు.

కేసు విత్‌ డ్రా చేసుకోవాలని బాధిత యువతి ప్రాధేయపడింది. అయినా జోసెఫ్‌ కనికరించలేదు. కన్నీటిపర్యంతమవుతూ తానో మంచి బాలుడిలా కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. జోసెఫ్ ఎలా మోసం చేశాడు..? కేసులు పెట్టి ఎందుకు వేధించాడు?

ఇవి కూడా చదవండి: డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్‌ ఎమ్మెల్యే.. ‘బుల్లెట్‌ బండి’ రాజయ్య స్టెప్పులు

YCP Leader Warning: పనులు ఆపేస్తారా.. దాడులు చేయమంటారా..కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ నాయకుడి వార్నింగ్‌

Mysterious Fever: చిన్నారులను వెంటాడుతున్న మరో అంతుచిక్కని జ్వరం.. 48 గంటల్లో 50 మంది మృతి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu