Fake Covid Vaccine: కరోనా క్రిమినల్స్.. ‘కోవిషీల్డ్’ పేరిట నకిలీ వ్యాక్సిన్ పంపిణీ.. లబోదిబోమంటున్న బాధితులు

Mumbai vaccination Scam: కరోనా క్రిమినల్స్ రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కోవిడ్ సాకుతో ఇటీవల భారీ మెడిసిన్ దందాకు పాల్పడిన క్రిమినల్స్.. ఇప్పుడు వ్యాక్సిన్ పేరుతో సామాన్యుల నుంచి దోచుకుంటున్నారు. వ్యాక్సిన్

Fake Covid Vaccine: కరోనా క్రిమినల్స్.. ‘కోవిషీల్డ్’ పేరిట నకిలీ వ్యాక్సిన్ పంపిణీ.. లబోదిబోమంటున్న బాధితులు
Covid-19 Vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 16, 2021 | 1:59 PM

Mumbai vaccination Scam: కరోనా క్రిమినల్స్ రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కోవిడ్ సాకుతో ఇటీవల భారీ మెడిసిన్ దందాకు పాల్పడిన క్రిమినల్స్.. ఇప్పుడు వ్యాక్సిన్ పేరుతో సామాన్యుల నుంచి దోచుకుంటున్నారు. వ్యాక్సిన్ ఇస్తామంటూ పలు కంపెనీలకు, హౌసింగ్ సోసైటీలను సంప్రదిస్తూ పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారు. దీంతోపాటు నకిలీ వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేస్తూ.. అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా ముంబైలో ఓ హౌసింగ్ సోసైటీలో దాదాపు 400 మందికి నకిలీ వ్యాక్సిన్లను వేసి.. ఈ ముఠా పెద్ద ఎత్తున దోచుకుంది. వివరాలు.. ముంబైలోని కందివాలి ప్రాంతంలోని హిరానాందానీ ఎస్టేట్ సొసైటీలో మే 30న కరోనా వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు. దీనిలో భాగంగా సొసైటీలోని సుమారు 390 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ డోసులను తీసుకున్నారు. అయితే.. ఆ వ్యాక్సిన్లు నకిలీవని తెలిసిన తరువాత సోసైటీ సభ్యులు లబోదిబోమంటున్నారు.

అయితే.. ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి ప్రతినిధిగా చెప్పుకునే.. రాజేష్ పాండే ముందుగా.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేస్తామని సోసైటీ సభ్యులను సంప్రదించాడు. అయితే.. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సంజయ్ గుప్తా సమన్వయం చేయగా.. మహేంద్ర సింగ్ అనే వ్యక్తి సొసైటీ సభ్యుల నుంచి నగదును వసూలు చేశాడని సొసైటీ సభ్యులు తెలిపారు. అయితే.. డోసుకు రూ.1,260 చొప్పున రూ.5లక్షలు చెల్లించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తమకు ఎలాంటి సందేశాలు అందలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఫోటోలు, సెల్ఫీలు కూడా తీసుకోనివ్వలేదని తెలిపారు. అయితే.. తీరా మెస్సెజ్ రాకపోవడంతో అనుమానం కలిగి.. సంప్రదించగా.. నిందితులు వారు సమాధానం చెప్పలేదని వెల్లడించారు. ఆ తర్వాత తాము వేసుకున్నది నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అని తేలిందన్నారు.

అనంతరం.. సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

Also Read:

Uttar Pradesh: పాపం పసిపాప..గంగా నదిలో చెక్క పెట్టెలో పెట్టి వదిలేశారు.. తర్వాత ఏమైందంటే..

Encounter: ఉలిక్కిపడిన మన్యం.. విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి!

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?