Aryan Khan Drugs Case: ఇప్పటివరకూ గోల్డెన్ స్పూన్‌తో సాగిన ఆర్యన్ ఖాన్ జీవితం.. రేపటి నుంచి ఎలా ఉండనున్నదంటే..

Aryan Khan Drugs Case :ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్. అవును తండ్రి వారసుడిగా...

Aryan Khan Drugs Case: ఇప్పటివరకూ గోల్డెన్ స్పూన్‌తో సాగిన ఆర్యన్ ఖాన్ జీవితం.. రేపటి నుంచి ఎలా ఉండనున్నదంటే..
Aryan Khan
Follow us
Surya Kala

|

Updated on: Oct 08, 2021 | 7:37 PM

Aryan Khan Drugs Case:ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్. అవును తండ్రి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాల్సిన సమయంలో డ్రగ్ కేసులో అరెస్ట్ అయి అత్యంత వివాదాస్పదంగా అందరికీ పరిచయమయ్యాడు.  క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి చుక్కెదురయింది. ఆర్యన్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించింది. ఆర్యన్‌ తో పాటు ఆర్బాజ్, దమేచకు కూడా బెయిల్‌ నిరాకరించింది. దీంతో.. ఆర్యన్‌ ఖాన్‌ను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. బెయిల్ పిటిష‌న్ తిర‌స్కర‌ణ‌తో ఎన్సీబీ క‌స్టడీ కింద ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్ధర్ రోడ్డు జైలులో గ‌డ‌ప‌నున్నారు. ఇన్ని రోజులు పట్టు పరుపులమీద పవళించి.. కోరిన తిండి తినే ఆడింది ఆటగా సాగిన ఆర్యన్ ఖాన్ జైలు జీవితం రేపటి నుంచి ఎలా ఉండనున్నదో తెలుసా..!

జైలు లో ఉండే నిందితులను, నేరస్థులను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు నిందితుడిని జైలు అధికారులు నిద్రలేపుతారు. కనుక ఆర్యన్ ఖాన్ తో పాటు ఆర్బాజ్, దమేచలు కూడా రోజూ ఉదయం 6గంటలకు నిద్ర లేవాల్సిందే. అనంతరం వారికి ఉదయం 7 గంటలకు అల్పాహారాన్ని జైలు సిబ్బంది అందిస్తారు. ఉదయం 11 గంటలకు, నిందితులైన ఆర్యన్ సహా మిగిలిన వారికి మధ్యాహ్న భోజనం అందించబడుతుంది. లంచ్ ,  డిన్నర్ రెండింటిలోనూ చపాతీ, ఒక కూర, పప్పు, అన్నం ఉంటాయి.  అయితే ఆర్యన్ ఖాన్  మాత్రమే కాదు.. ఎవరైనా నిందితులు జైలు క్యాంటీన్ నుండి అదనపు ఆహారాన్ని కోరుకుంటే.. దానికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మనీ ఆర్డర్ ద్వారా డబ్బు చెల్లించవచ్చు.

మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం జైలులోని ఖైదీలు జైలు పరిసరప్రాంతాల్లో తిరగడానికి అనుమతిస్తారు. అయితే  ఆర్యన్ ఖాన్, ఆర్బాజ్, దమేచలతో ఎవరైనా సరే జైలుకి వెళ్లిన ఐదు రోజులు పూర్తి అయ్యేవరకూ పరిసర ప్రాంతాల్లో తిరగడానికి అనుమతినివ్వరు.

సాయంత్రం ఆహారాన్ని 6 గంటలనుంచి నిందితులకు అందిస్తారు. సాయంత్రం 8 గంటల వరకూ ఆహారం అందుబాటులో ఉంటుంది. కనుక 6 నుంచి 8 లోపు ఎప్పుడైనా సాయంత్రం ఆహారం తినవచ్చు. ఇక ఆహారం తినే ప్లేస్ ఎవరిదీ వారే భద్రపరచుకోవడానికి అనుమతిస్తారు. ఇక జైలు లో ఉన్నంతకాలం ఆర్యన్ ఖాన్ కు జైలు క్యాంటిన్ ఆహారం మాత్రమే ఇవ్వబడుతుంది. ఇంటి వెలుపల ఆహారం అనుమతించరు.

గురువారంతో ఆర్యన్‌ సహా 8 మందికి ఎన్సీబీ కస్టడీ ముగియడంతో కోర్టు తిరిగి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించించాడు.

Also Read: ఆదివారం వ్యాక్సిన్ వేయించుకుంటే లక్కీ డ్రా.. వాషింగ్ మెషీన్స్, గ్రైండర్లు బహుమతి.. ఎక్కడంటే..

 అక్కినేని అఖిల్‌ కొత్త సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌.. నాగ చైతన్య ఏం మాట్లాడుతాడో.?