Telangana Crime News: ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది.. ప‌రాయి వ్య‌క్తి మోజులో ప‌డి

మేడ్చల్‌ జిల్లా జీడిమెట్లలోని... భగత్​సింగ్​నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేత సంబంధానికి అడ్డు వస్తున్నాడని... కన్న కొడుకునే ఓ తల్లి అత్యంత దారుణంగా...

Telangana Crime News: ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది.. ప‌రాయి వ్య‌క్తి మోజులో ప‌డి
Mother Kills Son
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2021 | 8:23 PM

మేడ్చల్‌ జిల్లా జీడిమెట్లలోని… భగత్​సింగ్​నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేత సంబంధానికి అడ్డు వస్తున్నాడని… కన్న కొడుకునే ఓ తల్లి అత్యంత దారుణంగా కొట్టి హ‌త‌మార్చింది. జగద్గిరిగుట్టకు చెందిన సురేష్​కు… ఉదయతో ఐదేళ్ల కిందట పెళ్లి జ‌రిగింది. వీరికి ఉమేష్‌ అనే కుమారుడు ఉన్నాడు. భాస్కర్ అనే మేస్త్రీ వద్ద సురేష్​ పనికి వెళ్తుండేవాడు. భర్త పనికి వెళ్లిన సమయంలో భాస్కర్​తో ఉదయ చ‌నువుగా ఉండేది. గమనించిన భర్త… ప‌ద్ద‌తి మార్చుకోమ‌ని హెచ్చరించాడు. కొన్ని రోజులకు కుమారుడు ఉమేష్(3)ను తీసుకుని భాస్కర్​తో కలిసి వెళ్ళిపోయింది ఉద‌య‌. కుమారునితో కలిసి రెండేళ్లుగా భగత్​సింగ్​నగర్​లో ఆమె నివాసముంటోంది. తన కుమారుడిని చూడడానికి పలుమార్లు సురేష్… జగద్గిరిగుట్ట నుంచి భగత్​సింగ్​నగర్​కు వచ్చి.. వెళ్తుండేవాడు. కుమారుని కారణంగా సురేష్ పదే పదే తన ఇంటికి వస్తున్నాడన్న కోపంతో పిల్లాడిని కర్రతో తీవ్రంగా కొట్టి గాయ‌ప‌రించింది. దెబ్బలు తట్టుకోలేక స్పృహ కోల్పోయిన బాలున్ని… పలు ఆసుపత్రులకు తీసుకెళ్లి చివరకు సురారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించింది. అక్క‌డ బాలుడుని టెస్ట్ చేసిన డాక్ట‌ర్లు మృతి చెందినట్లు నిర్ధారించారు.వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే… తన కుమారుణ్ని చంపేశారని భర్త సురేష్‌ ఆరోపించాడు. ఉదయను పలు మార్లు ఇంటికి రావాలని అడిగినా… పట్టించుకోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Also Read: భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ రమణకు ఐదో తరగతి విద్యార్థిని లేఖ.. స్పందించిన సీజేఐ

తూర్పుగోదావరి జిల్లాలో ఒంటరి మహిళపై దుండ‌గుల అత్యాచారయత్నం.. ఆమె గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో