Call Boy: యువ‌తితో చాటింగ్‌.. ప‌ర్స‌న‌ల్ ఫొటోలతో వేధింపులు.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ యువ‌కుడి వికృత చేష్ట‌లు..

Call Boy: చాటింగ్‌ల పేరుతో యువ‌తుల‌ను మోస‌గిస్తోన్న సంఘ‌ట‌న‌లు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. టెక్నాల‌జీని ఉయోగించుకుంటూ మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నారు కొంద‌రు ప్ర‌బుద్ధులు. పోలీసులు ఎంత మందిని...

Call Boy: యువ‌తితో చాటింగ్‌.. ప‌ర్స‌న‌ల్ ఫొటోలతో వేధింపులు.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ యువ‌కుడి వికృత చేష్ట‌లు..
Mahbubnagar Degree Student
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 08, 2021 | 5:20 PM

Call Boy: చాటింగ్‌ల పేరుతో యువ‌తుల‌ను మోస‌గిస్తోన్న సంఘ‌ట‌న‌లు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. టెక్నాల‌జీని ఉయోగించుకుంటూ మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నారు కొంద‌రు ప్ర‌బుద్ధులు. పోలీసులు ఎంత మందిని ప‌ట్టుకొని శిక్షించినా.. ఇలాంటి ఆగ‌డాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి రాచ‌కొండ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. మ‌హ‌బూబ్ నగ‌ర్ జిల్లాకు చెందిన తుమ్ము భ‌ర‌త్ కుమార్ అనే యువ‌కుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చ‌దువుతున్నాడు. అశ్లీల చిత్రాలు చూడ‌డానికి అల‌వాటుప‌డిన భ‌ర‌త్‌.. తనను తాను కాల్ బాయ్‌గా ప‌లు వెబ్‌సైట్లలో, ఇతర డేటింగ్‌ సైట్లలో ఫోన్‌నంబర్‌ అప్‌లోడ్ చేశాడు. అయితే ఎవ‌రి నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో.. చాటింగ్‌ చేసే యువతుల కోసం వెతికాడు. ఈ క్ర‌మంలోనే ఓ యువ‌తితో చాటింగ్‌లోకి దిగాడు. కొద్ది కాలానికి స‌ద‌రు యువ‌తి నుంచి ప‌ర్స‌న‌ల్ ఫొటోల‌తో పాటు కుటుంబ స‌భ్యుల ఫొటోల‌ను పొందాడు. ఇలా సంపాదించిన ఫొటోల‌తో.. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను సృష్టించాడు. వారి ఫొటోలను కాంటాక్టు నంబర్‌లు సోషల్‌మీడియాలో పోస్టు చేసి.. డ‌బ్బు ఇవ్వ‌మ‌ని వారిని బ్లాక్ మేల్ చేశాడు. దీంతో వేధింపులు త‌ట్టుకోలేని ఆ యువ‌తి.. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడిని అరెస్టు జైల్లో వేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి: TV9 Appreciates Nurses Care: మానవత్వం పరిమళించిన వేళ..! కరోనా పేషెంట్‌కు భోజనం తినిపించిన నర్సులు..

PF Link Aadhar: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ కార్డు లింక్ చేయ‌లేదా.? వెంట‌నే ఇలా చేయండి.. లేదంటే చాలా న‌ష్ట పోతారు..

Malayalam movies in OTT platforms: తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటున్న మలయాళ సినిమాలు..