KIMS : కిమ్స్ నిర్వాకం.. కొవిడ్ మృతదేహాలు మార్చి ఇచ్చిన వైనం.. వేరే వ్యక్తికి అంత్యక్రియలు చేసిన కుటుంబసభ్యులు.. దీంతో.. ఏమైందంటే..!

ఒక విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కొవిడ్ తో మృతి చెందగా అతని బంధువులకు వేరే మృతదేహాన్ని ఇచ్చారు ఆసుపత్రి సిబ్బంది

KIMS : కిమ్స్ నిర్వాకం.. కొవిడ్ మృతదేహాలు మార్చి ఇచ్చిన వైనం.. వేరే వ్యక్తికి అంత్యక్రియలు చేసిన కుటుంబసభ్యులు.. దీంతో.. ఏమైందంటే..!
Kims hospital staff negligence
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 08, 2021 | 8:37 PM

Amalapuram KIMS : అమలాపురం కిమ్స్ వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. కొవిడ్ మృతదేహాలు మార్చి ఇచ్చిన నిర్వాకం బట్టబయలైంది. ఒక విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కొవిడ్ తో మృతి చెందగా అతని బంధువులకు వేరే మృతదేహాన్ని ఇచ్చారు ఆసుపత్రి సిబ్బంది. అయితే, అది వేరే వ్యక్తి డెడ్ బాడీ కావడంతో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే, పి. గన్నవరం మండలం మొండెపు లంకకు చెందిన ఇమ్మని వెంకటదుర్గారావు (60), రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి గంజి విజయ్ కుమార్ (45) ఆదివారం రాత్రి కరోనాతో కిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో మృతి చెందారు.

ఈ క్రమంలో వెంకట దుర్గారావు కుటుంబీకులు మృతదేహం కోసం వస్తే దుర్గారావుకు బదులు ఆర్మీ ఉద్యోగి విజయ్ కుమార్ మృతదేహాన్ని దుర్గారావు బంధువులకు అప్పగించారు ఆసుపత్రి సిబ్బంది. దీంతో వెంకట దుర్గారావు బంధవులు అమలాపురం నల్లవంతెన వద్ద శ్మశానవాటికలో వేరే వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించేశారు.

సోమవారం మధ్యాహ్నం ఆర్మీ ఉద్యోగి మృతదేహం కోసం వచ్చిన కుటుంబీకులకు విజయ్ కుమార్ మృతదేహం బదులుగా… ఇమ్మని వెంకటదుర్గారావు మృతదేహాన్ని అప్పగించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు తారుమారు అయిన విషయం అర్థమైన ఆస్పత్రి సిబ్బందికి చెమటలు పట్టాయి. దీంతో సంగతి తెలుసుకున్న ఆర్మీ ఉద్యోగి తాలూకు బంధువులు ఆందోళన చేపట్టారు. అయితే, ఇప్పటికే ఆర్మీ ఉద్యోగి మృతదేహా నికి అంత్యక్రియలు పూర్తికావడంతో ప్రస్తుతం ఉన్న వెంకటదుర్గారావు మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. దీంతో ఇవాళ దుర్గారావు బంధువులు మళ్ళీ అంత్యక్రియలు నిర్వహించారు.

Read also : Jagan letter to Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ.. వివరాలు