Illegal drug mafia 2022: బీఎస్‌ఎఫ్-ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆపరేషన్.. రూ.2 కోట్ల విలువైన మెథాంఫేటమిన్ డ్రగ్స్ సీజ్!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), మిజోరం ఎక్సైజ్, డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా నిర్వహించిన దాడిలో దాదాపు రూ. 2 కోట్ల విలువైన 12 కిలోల మెథాంఫేటమిన్ (Crystal meth) మాత్రలను శుక్రవారం సీజ్ చేశారు...
Mizoram excise dept and BSF combined operation: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), మిజోరం ఎక్సైజ్, డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా నిర్వహించిన దాడిలో దాదాపు రూ. 2 కోట్ల విలువైన 12 కిలోల మెథాంఫేటమిన్ (Crystal meth) మాత్రలను శుక్రవారం సీజ్ చేశారు. ఈ మేరకు అస్సాం (Assam)సరిహద్దు సమీపంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అధికారుల చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ శాఖ అధికారులు, బీఎస్‌ఎఫ్ జవాన్లు ఉత్తర మిజోరాం సరిహద్దులోని కొలాసిబ్ జిల్లాలో జాతీయ రహదారి-306పై ఉత్తర చిమ్లువాంగ్ గ్రామ శివార్లలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో దాదాపు 12.8 కిలోల మెథాంఫెటమిన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పెడ్లర్లను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిందితులను అస్సాంలోని కాచర్ జిల్లా సిల్చార్‌కు చెందిన షమీర్ దేబ్ (49), మయన్మార్‌లోని ఖవ్మావి గ్రామానికి చెందిన సోలమన్ జోనున్మావియా (35)గా గుర్తించారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన ఈ అక్రమ డ్రగ్స్‌ను మయన్మార్ నుంచి తరలించి మిజోరాం వెలుపల విక్రయిస్తున్నట్లు సమాచారం. వీరిపై నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985లోని పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నట్లు మీడియాకు తెలిపారు.
Also Read: