Serial Killers Of World: వీరికి హత్యలు చేయడమే హాబీ! ప్రపంచాన్ని గడగడలాడించిన టాప్‌ 5 సీరియల్‌ కిల్లర్స్‌ వీరే!

పగ, ప్రతీకారం మనిషిని నిలువునా నాశనం చేసే సాధనాలు. వీటికి ఎంత దూరంగా ఉండే అంతమంచిది. ఐతే కొందరు కారణంలేకుండానే ఇతరుల ప్రాణాలను అత్యంత కౄరంగా తీస్తుంటారు. అటువంటి టాప్‌ 5 సీరియల్‌ కిల్లర్ల గురించి..

Serial Killers Of World: వీరికి హత్యలు చేయడమే హాబీ! ప్రపంచాన్ని గడగడలాడించిన టాప్‌ 5 సీరియల్‌ కిల్లర్స్‌ వీరే!
Serial Killers
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 13, 2022 | 12:40 PM

Worlds’ Top Serial Killers: మనందరికీ రకరకాల అలవాట్లుంటాయి. బుక్స్‌ చదవడం, ఆటలాడటం, మొక్కలు, పెయింటింగ్‌, స్మోకింగ్‌, డ్రింకింగ్.. ఇలా పుర్రెకో అభిరుచి ఉంటుంది. ఇవన్నీ సాధారణంగా అందరికీ ఉండేవే. ఐతే ఈ జిందగీలో వింత అభిరుచులున్న వ్యక్తులు కూడా ఉంటారండీ! వింతైతే పర్వాలేదు.. అది పైత్యమైతేనే చిక్కంతా మొదలౌతుంది. అవును.. కొందరు వ్యక్తులకు మనుషులను చంపడమే హాబీనట. ఇలాంటి వాళ్లనే సీరియల్‌ కిల్లర్లని అంటారు. ఇదొకరకమైన మానసిక వ్యాధి అని సైకాలజిస్టులంటారు. అంటే చంపడానికి ప్రత్యేకకారణం అంటూ ఏమీ లేకుండానే వాళ్ల కాలక్షేపంకోసం ఇతరుల ప్రాణాలు తీస్తుంటారు. పిల్లలను కూడా విడిచిపెట్టని కొంతమంది హంతకుల గురించి తెలిస్తే మీరు మరింతగా ఆశ్చర్యపోతారు. అమాయక పిల్లలను సైతం క్రూరంగా చంసిన ఉందంతాలులేకపోలేదు. ఈ హంతకుల గురించి ఎంత చెప్పినీ తక్కువే. ఈ రోజు మనం అలాంటి క్రూరమైన టాప్‌ 5 సీరియల్‌ కిల్లర్ల గురించి తెలుసుకుందాం..

డాక్టర్ హోరాల్డ్ షిప్‌మన్ ప్రపంచంలోని టాప్ సీరియల్ కిల్లర్స్ లిస్టును పరిశీలిస్తే.. డాక్టర్ హోరాల్డ్ షిప్‌మన్ పేరు ఖచ్చితంగా తెర మీదికొస్తుంది. ఇతను 200 కంటే ఎక్కువ హత్యలకు పాల్పడ్డాడు. వృత్తిరీత్యా వైద్యుడు కావడం చేత ఎవరికీ అనుమానం రాని విధంగా పేషెంట్లను హత్య చేసేవాడు. ఒక డాక్టర్‌ ఇలా మనుషులను చంపగలడని ఎవరూ కనీసం ఊహించలేరు. సదరు డాక్టర్‌కి వివాహమై, కుటుంబంలో ఐదుగురు సభ్యులున్నప్పటికీ ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడట. తోటి డాక్టర్లతో కూడా కలివిడిగా మాట్లాడేవాడు కాదు. రాహస్యంగా తన పనిని కానిచ్చేవాడు.

జాక్ ది రిప్పర్ బ్రిటన్‌లోని లండన్‌లో 1888లో జాక్ ద రిప్పర్ అనే కరడుగట్టిన నేరస్థుడు వరుస హత్యలతో నగరంలో సంచలనం సృష్టించాడు. ఐతే ఈ నేరస్థుడి అసలు పేరు మాత్రం ఇప్పటికీ బయటికిరాలేదు. అతను కేవలం వేశ్యలను మాత్రమే హత్య చేసేవాడు. వారి మెడను కోసి హత్యచేసిన తర్వాత శరీరం నుండి అంతర్గత అవయవాలను బయటకు తీసేవాడు. హతమార్చడం, మనుషుల అవయవాలను తొలగించడం వల్లే అతడికి ఆ వింత పేరు వచ్చింది. ఇంతటి కౄరమైన హత్యలకు పాల్పడటంతో అప్పట్లో అతని పేరు మారుమోగిపోయింది. అతని పేరు మీద అనేక భయానక వీడియో గేమ్‌లు కూడా వచ్చాయి.

ఆండ్రీ చికాటి రష్యాలో ఆండ్రీ చికాటిలో1978 నుంచి హత్యలు చేయడం ప్రారంభించాడు. హత్యలన్నీ మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసేవాడు. ముందుగా మహిళలను, పిల్లలను కిడ్నాప్ చేసి, ఆపై వారి గొంతు కోసి అత్యంత కౄరంగా హత్యచేసేవాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసినప్పుడు.. 56 మంది మహిళలు, పిల్లలపై అత్యాచారం, హత్య చేసినట్లు చెప్పాడు.

టెడ్ బండీ 1970ల నాటి సీరియల్ కిల్లర్ టెడ్ బండీ అమెరికాలోని పలు నగరాల్లో అందమైన స్త్రీలను అత్యాచారం చేసి, ఆపై వారిని చంపేవాడు. ఆ విధంగా మొత్తం 36 మంది యువతులను హత్య చేశాడు. ఈ సినికల్ కిల్లర్‌ (cynical killer)కు ఫ్లోరిడా కోర్టు శిక్ష విధించే సమయంలో విచారణలో అతను తెల్పిన విషయాలను టీవీలో కూడా ప్రసారం చేసింది. ఈ నేరాలకు పాల్పడినందుకుగాను అతన్ని ఎలక్ట్రిక్ కుర్చీకి కట్టేసి మరణశిక్ష విధించింది కోర్టు.

జాన్ వేన్ గేసీ పిల్లల ఆసుపత్రులకు, పార్టీలకు బఫూన్‌ వేషధారణలో వెళ్లి, పిల్లలతో ఆటలాడి, ఆ తర్వాత కిడ్నాప్‌కు పాల్పడేవాడు. ముందుగా పిల్లలను చంపి, తర్వాత అత్యాచారం చేసేవాడట. పోలీసులు అతడిని పట్టుకుని ఇంట్లో సోదా చేయగా అక్కడ 29 కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. మొత్తం 33 మందిని చంపినట్లు అతను విచారణలో ఒప్పుకున్నాడు.

Also Read:

RRI Recruitment 2022: ఫిజిక్స్ పీహెచ్‌డీ చేసిన వారికి బంపరాఫర్!.. రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు..