దారుణం.. ఇళ్లపై బాంబులు విసిరిన పోకిరీలు
ఉత్తర్ ప్రదేశ్‌లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. కాన్పూర్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిపై బాంబులు విసిరారు. అయితే అవి సాధారణమైనవి కావడంతో ఎలాంటి నష్టం వాటిళ్లలేదు. అయితే దుండగులు..
ఉత్తర్ ప్రదేశ్‌లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. కాన్పూర్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిపై బాంబులు విసిరారు. అయితే అవి సాధారణమైనవి కావడంతో ఎలాంటి నష్టం వాటిళ్లలేదు. అయితే దుండగులు ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారన్నది తెలియరాలేదు. ఈ సంఘటన గురువారం తెల్లవారు జామున.. గుజైనీ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్కడ ఉన్న సీసీ ఫుటేజీల ప్రకారం అనుమానితులను గుర్తించామని.. వారి ఇళ్లకు వెళ్లిన సమయంలో అక్కడ ఎవ్వరూ లేరని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని సౌత్ కాన్పూర్ ఎస్పీ బీ.మూర్తి తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని.. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిని ఉపేక్షించేది లేదన్నారు.
Read More :
దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు