భారీ ఎత్తున పట్టుబడ్డ హిల్షా ఫిష్

వెస్ట్‌ బెంగాల్‌లో అక్రమ వ్యాపారాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. విచ్చల విడిగా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు వాహనాలను స్థానిక పోలీసులతో..

  • Tv9 Telugu
  • Publish Date - 5:46 am, Fri, 7 August 20
భారీ ఎత్తున పట్టుబడ్డ హిల్షా ఫిష్

వెస్ట్‌ బెంగాల్‌లో అక్రమ వ్యాపారాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. విచ్చల విడిగా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు వాహనాలను స్థానిక పోలీసులతో పాటుగా.. సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు సైతం చెక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు రాష్ట్రంలోని నార్త్ పరగణ జిల్లాలోని పెట్రాపోల్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ట్రక్కులో భారీ ఎత్తున హిల్షా ఫిష్‌ను తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.11.26 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ట్రక్కుతో పాటు, అందులో ఉన్న హిల్షా ఫిష్‌ను సీజ్ చేశామని.. నిందితుడిని అరెస్ట్ చేశామని స్థానిక పోలీసులు తెలిపారు.

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు