బ్యాగ్‌ స్ట్రిప్‌లో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డ గోల్డ్‌ స్మగ్లర్లు..

కేరళలో మరో గోల్డ్‌ స్మగ్లింగ్‌ ముఠా పట్టుబడింది. దుబాయి నుంచి కేరళకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద దాదాపు కిలో బంగారాన్ని గుర్తించారు. కన్నూర్‌ ఎయిర్‌ పో్ర్టులో కస్టమ్స్‌ అధికారులు చేపట్టిన..

బ్యాగ్‌ స్ట్రిప్‌లో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డ గోల్డ్‌ స్మగ్లర్లు..

కేరళలో మరో గోల్డ్‌ స్మగ్లింగ్‌ ముఠా పట్టుబడింది. దుబాయి నుంచి కేరళకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద దాదాపు కిలో బంగారాన్ని గుర్తించారు. కన్నూర్‌ ఎయిర్‌ పో్ర్టులో కస్టమ్స్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడింది. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారి బ్యాగ్‌ లోపల ఉండే స్ట్రిప్స్‌కు మెర్క్యూరీ కోటింగ్‌ వేసి బంగారాన్ని తీసుకువచ్చారని తెలిపారు. పట్టుబడ్డ బంగారం 0.932 కిలోలు ఉందని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.53 లక్షలు ఉంటుందని వెల్లడించారు.

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Click on your DTH Provider to Add TV9 Telugu